Home Latest News ఏపీకి మరో రెండు తుపానులు: ఈ నెలాఖరుకు ఒకటి, డిసెంబర్ లో రెండు.! | మరో రెండు తుఫాన్లు | MET | జాగ్రత్త | ఆంధ్రప్రదేశ్ | బంగాళాఖాతం – Andhra Waves

ఏపీకి మరో రెండు తుపానులు: ఈ నెలాఖరుకు ఒకటి, డిసెంబర్ లో రెండు.! | మరో రెండు తుఫాన్లు | MET | జాగ్రత్త | ఆంధ్రప్రదేశ్ | బంగాళాఖాతం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అనిపించేలా రాష్ట్రాన్ని ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా తుపానులు వెన్నాడుతున్నాయి. తాజాగా ఏపీకి మరో రెండు తుపానుల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవలి కాలంలో వరుస తుపాన్ల ప్రభావంతో రాష్ట్రంలో పంట, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ నష్టం అంచనాలు ఇంకా పూర్తిగా కొలిక్కి రాకముందే.. ఇప్పుడు రాష్ట్రంలో మరో రెండు తుపానులు విరుచుకుపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.

ఈ నెలాఖరుకు బంగాళాఖాతంలో ఒక తుపాను, , డిసెంబరు మొదటి వారం తరువాత మరో తుపాను ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబరు నెలాఖరులో వచ్చిన అర్నబ్’ తుపాను, నవంబరు 1న వచ్చిన మురసు తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత ఏర్పడిన అక్వాన్ తుపాను దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించడంతో రాష్ట్రానికి పెనుముప్పు తప్పింది. అయితే ఆ తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండానే రాష్ట్రంపై మరో రెండు తుపానులు పంజా విసురుతాయన్న వార్త, అటు అధికార యంత్రాంగానికి, ఇటు తీరప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కేవలం రెండు తుపానులకు తోడు బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సముద్ర నివాస పరిస్థితులు, గాలుల కదలికలు తుపాన్ల ఏర్పాటుకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అల్పపీడనాలు, ఆ తర్వాత వాయుగుండాలు ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుందని వాతావరణ శాఖ, సముద్రంపై విస్తరించిన రుతుపవనాలు తేమను గ్రహించడం వల్ల అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ఈ అల్పపీడనాలు, వాయుగుండాలు తుపాన్లుగా మారిన తర్వాత ఏ దిశగా ప్రయాణిస్తాయనే పరిశీలన ఇప్పటికిప్పుడు అంచనా వేయడం సాధ్యంకాదని సూచిస్తుంది. ఈ తుపాన్ల ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా ఇతర తీర ప్రాంత రాష్ట్రాలపైనా పడే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నవంబర్ తుపాను: గడగడలాడుతున్న ఏపీ.!

తూర్పు తీరంలోని ఈ రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరుస తుపానుల కారణంగా సంభవించిన నష్టాల నుంచి తేరుకోలేక సతమతమవుతున్న ఏపీకి మళ్లీ తుపాన్ల హెచ్చరికలు రావడం తీరప్రాంత వాసుల్లో, రైతుల్లో, ప్రజల్లో ఆందోళన పెంచుతోంది.

రానున్న రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల స్థాయి, రుతుపవనాల కదలికలను బట్టి తుపాన్ల తీవ్రత, గమనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెలాఖరు, డిసెంబరు ప్రారంభంలో ఏర్పడే వ్యవస్థలు ఏ విధంగా బలపడతాయనే వాతావరణ శాఖలు, నిపుణులు నిశిత వాతావరణంలో వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సంభవించే నష్టాలను కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మీకు నచ్చవచ్చు: ఏపీకి మరో తుపాను ముప్పు: రాష్ట్రంపై ప్రకృతి పగపట్టిందా.?

ఏపీకి మరో తుపాను గండం: దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు.!

[Two more cyclones, MET, Caution,  Andhra Pradesh,  Bay of Bengal, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird