21వ శతాబ్ధంలోనూ ఆడపిల్లల తల్లిదండ్రులకు వరకట్నం బాధలు తప్పటం లేదు. చదువుకున్న వారు, ఉన్నత స్థాయిలో ఉన్న మగవారు కూడా అత్తామామలను కట్నం కోసం వేధిస్తున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, హర్యానాలోని సోనిపట్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు కాబోయే అత్తింటివారు సుమారు 9.5 లక్షల రూపాయల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు. అయితే, తనకు ఆ కారు వద్దు.. సుమారు 13 లక్షల రూపాయల విలువైన మారుతీ బ్రెజా కావాలని వరుడు పట్టుబట్టాడు. ఆ కారు ఇవ్వలేదనే కారణంతో పెళ్లినే రద్దు చేసుకుని వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు మండపం వరుడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
సోనిపట్‌కు చెందిన సుభాష్ కుమార్ తన కుమార్తె హీనాకు, ఢిల్లీ పోలీస్ నిర్వహిస్తున్న కుల్దీప్తో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయించాడు. నవంబర్ 20వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కుదిరినప్పటి నుంచే బంగారు వరుడి కుటుంబం కారు, ఆభరణాలు కావాలని డిమాండ్ చేయాలని డిమాండ్ వధువు తండ్రి ఆరోపిస్తున్నాడు. వరుడి కోసం సుమారు 9.5 లక్షల విలువైన హ్యుందాయ్ ఆరా కారును బుక్ చేశారు.
కానీ, పెళ్లికి ఒక్కరోజు ముందు మధ్యవర్తుల ద్వారా కుల్దీప్కు ఆ కారు నచ్చలేదని, మారుతీ బ్రెజా కావాలని కోరుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే బుక్ చేసిన కారును రద్దు చేసి బ్రెజా కోసం ప్రయత్నించారు. అయితే, పెళ్లికి సమయం తక్కువగా ఉండటంతో ఆ కారును తీసుకురాలేకపోయారు. కారు విషయంలోనే కాకుండా బంగారు ఆభరణాల విషయంలోనూ వరుడి కుటుంబం డిమాండ్లు చేశారు. వరదుడికి రెండు తులాల బంగారు గొలుసు, అతడి తల్లికి నాలుగు తులాల బంగారు చెవి దిద్దులు, వెండి పట్టీలు ఇచ్చేందుకు పెళ్లి కూతురి తండ్రి అంగీకరించాడు.
వరుడి సోదరుడు, వదినకు కూడా బంగారు ఆభరణాలు కావాలని అడగడంతో వాటిని సైతం తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు. వీటితో పాటు సుమారు రూ.1.32 లక్షల విలువైన వస్తువులను, ఇతర గృహోపకరణాలను కూడా సిద్ధం చేశాడు. నవంబర్ 20వ తేదీన సోనిపట్‌లోని మామచంద్ వాటికలో పెళ్లి వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 1,200 మంది అతిథుల కోసం భోజనాలు సిద్ధం చేశారు. అయితే, పూర్తి పెళ్లి బృందంతో రావాల్సిన వరుడు కుల్దీప్.. తన తల్లితో కలిసి సాధారణ దుస్తుల్లో అక్కడికి వచ్చాడు. ముందుగా బ్రెజా కారు కోసం వెతికాడు.
అది కనిపించిన వధువు కుటుంబంతో వాగ్వాదానికి దిగాడు. పెళ్లి ఆపకుండా వధువు కుటుంబ సభ్యులు, బంధువులు చేతులు జోడించి వేడుకున్నా వరుడు వినలేదు. చివరకు పెళ్లి చేసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి దుస్తుల్లోనే ఉన్న హీనా మండపం మిగిలిపోయింది. ఈ ఘటన అనంతరం వధువు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుల్దీప్తో పాటు అతడి తల్లి, సోదరుడు, వదిన, ఇద్దరు మధ్యవర్తులపై చర్యలు తీసుకున్నారు.
