Home Latest News తన పాలనకు రేవంత్ సెల్ఫ్ రేటింగ్: నూటికి 65 మార్కులే.! | తెలంగాణ సీఎం | రేవంత్ రెడ్డి | సెల్ఫ్రేటింగ్ | పాలన – Andhra Waves

తన పాలనకు రేవంత్ సెల్ఫ్ రేటింగ్: నూటికి 65 మార్కులే.! | తెలంగాణ సీఎం | రేవంత్ రెడ్డి | సెల్ఫ్రేటింగ్ | పాలన – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకు తానే రేటింగ్ ఇచ్చుకుని సంచలనానికి తెరలేపారు ఒక జాతీయ మీడియా సదస్సులో ఆయన తన పాలనకు 65 శాతం మార్కులు ఇవ్వొచ్చని ప్రకటించారు. ఇంకా చేయాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేయాలని రేవంత్ చెప్పారు. సాధారణంగా నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటారు. అలా అతి విశ్వాసంతో తమ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్న చాలా మంది ముఖ్యమంత్రులకు ఎన్నికలలో ప్రజలు తన ఓటు ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి.

అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను ఏం చేశాను? ఇంకా ఏమి చేయాలి? ఎంత వరకూ చేయగలను? అన్న స్పష్టత కనిపిస్తోంది. అందుకే ఇప్పటి వరకూ తన పాలన ఎలా ఉందో అన్న విషయంలో ఆయన చాలా వాస్తవంగా, నిజాయితీగా చెప్పారు.

జాతీయ మీడియా సదస్సులో, ఇప్పటివరకు మీ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారన్న ప్రశ్న ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తడుముకోకుండా, తడబడకుండా నూటికి 65 మార్కులు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తానే తక్కువ మార్కులు ఇచ్చుకోవడం ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పింది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందనీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయనీ చెప్పిన రేవంత్ వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

సాధారణంగా ముఖ్యమంత్రులు తాము చేయగలిగినదంతా అని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ, మీకు తామే వంద శాతం రేటింగ్ ఇచ్చుకుంటూ స్వోత్కర్షకు ప్రాధాన్యత ఇస్తుంటారు. రేవంత్ రెడ్డి తాను చేయాల్సినది ఇంకా ఉందనీ, మూడేళ్ల పాలనా కాలంలో కేవలం 65 శాతం మాత్రమే తాను అనుకున్నది చేయగలిగానని నిస్సంకోచంగా అంగీకరించి పరిశీలకులను సైతం విస్మయపరిచారు.

ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!

తాను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పడం, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా తనకు నూటికి 64 మార్కులే పడ్డాయని ధైర్యంగా చెప్పగలగడం ద్వారా తాను వాస్తవ వాస్తవాలను అంగీకరించడానికి భయపడనని చాటినట్లైంది.

అదే సమయంలో మిగిలిన రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల అంచనాలను చేరుకుని మిగిలిన 35 మార్కులూ కూడా సాధిస్తానని ధైర్యంగా చెబుతున్నా.. తాను వందశాతం ప్రజామోదం పొందేందుకు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. మొత్తం మీద తనకు తాను రేటింగ్ ఇచ్చుకుని రేవంత్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీకు నచ్చవచ్చు: మహిళా శక్తే నా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

డీ లిమిటేషన్ దక్షిణాదికి గొడ్డలి పెట్టు: అమిత్ షా దమ్ముంటే ఒవైసీపై పోటీకి దిగు.!


[TelanganaCM, Revanth Reddy, Selfrating, Governence,  TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird