
భారత్ పై యుద్ధానికి పాకిస్థాన్, జైనాలు జమిలిగా వ్యూహాలు రచిస్తున్నాయా? అంటే యుద్ధ నిపుణులు, సరిహద్దు పరిశీలన పర్యవేక్షకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఇందుకుగాను జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతోంది. ఈ పరిణామాలు దేశ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాజా పరిణాలను ఒక సారి అవలోకిస్తే.. నవంబర్ 11న కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా మిర్ బజార్ సమీపంలోని అఖ్రాన్ సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరారైయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆర్పీఎఫ్ జవాన్లలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వెంటనే అదనపు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో జిల్లాలో అధికారిక కార్యక్రమంలో ఉన్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా నవంబర్ 12న కిష్టావర్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో ఇద్దరు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోలీసు అధికారులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. బాబీ చంద్ (57), రాష్‌పాల్ కుమార్ (47) అనే ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారులు రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపులో ఉన్న సహచరులకు రిలీఫ్ ఇచ్చేందుకు వెళ్తూ మార్గమధ్యంలో కనిపించకుండా పోయారు. వారి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో అధికారులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం పర్వత ప్రాంతంలో దట్టమైన అడవిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. తూటాల గాయాలతో మృతి చెందిన వారి ఆయుధాలు కనిపించకపోగా.. ఈ ఘటనలో రోజు పదో తరగతి విద్యార్థి ఒకరు వారి వద్దకు వచ్చి హెచ్చరించినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు చేపట్టారు.
అడలా ఉంటే.. నవంబర్ 14న సిక్కిం భూభాగంపై పాతిక వేల అడుగుల ఎత్తులో చైనాకు చెందిన ఫైటర్ జెట్ దాదాపు పాతిక నిముషాల పాటు గగనతలంలో ఎగిరినట్లు నివేదికలను ఉటంకిస్తూ.. అధికారులు. ఆ విమానం ఏ మోడల్‌కు చెందినదనే వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా పాకిస్తాన్ సైనిక సన్నద్ధత, ఆయుధ సేకరణలపై రక్షణ రంగ విశ్లేషకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆగస్టు నెలలో టర్కీ నుంచి కే2 టాక్టికల్ లోయిటరింగ్ మ్యూనిషన్, అసిస్‌గార్డ్ సాంగ్ డ్రోన్ వ్యవస్థలు, శాట్‌కామ్ ఆధారిత బైరాక్టర్ టీబీ2 డ్రోన్లు, టీఏఐ అంకా, మానవరహిత యుద్ధ విమానం, సూపర్ సిమ్సెక్ డ్రోన్ల వంటి ఆయుధాలను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. చైనా నుంచి అలాగే అప్లోడ్ చేయబడిన హెచ్‌క్యూ9బీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను సమకూర్చుకుందని, వీటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో సౌదీ అరేబియా సహకారం ఉందని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో, చైనాలు సంయుక్తంగా వ్యూహాత్మక కదలికలు చేస్తున్నాయన్న నిఘా వర్గాల, సీఐఏ సమాచారం వంటి భద్రతా నిపుణులు దృష్టి సారించారు.

మరోవైపు, కుల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన నిందితుడిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని సహచరుడు ఉమర్ నిసార్ దార్లను భద్రతా దళాలు ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. కుల్గామ్ ఏర్పాటు ఒక మసీదులో స్థానికుల సహాయంతో వీరు తలదాచుకున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
ఇది కూడా చదవండి:
రాబోయే రోజుల్లో జమ్మూ కశ్మీర్‌లోని సున్నిత ప్రాంతాలపై వ్యతిరేక గాలింపు చర్యలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. సరిహద్దు రేఖ (ఎల్ఓసీ), వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గగనతల, భూతల నిఘాను మరింత బలోపేతం చేయడంపై భద్రతా దృష్టి సారించాల్సిన పరిస్థితి.

ఉగ్రవాద ముప్పును సమర్థంగా అరికడుతూ, సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగాల్సి ఉంది. మొత్తం మీద పాకిస్థాన్, చైనాల నుంచి యుద్ధముప్పు గతంలో కంటే ఎక్కువగా ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
మీకు నచ్చవచ్చు:
[Kashmir Terror attacks, Chinese jetm Sikkim, ChinaPak, Joint War, Stratagies, TeluguOne]
