Home Latest News ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..! | గుండె జబ్బులు రాకుండా ఉండే సింపుల్ డైలీ హ్యాబిట్స్ | గుండె ఆరోగ్య రహస్యాలు – Andhra Waves

ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..! | గుండె జబ్బులు రాకుండా ఉండే సింపుల్ డైలీ హ్యాబిట్స్ | గుండె ఆరోగ్య రహస్యాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..! | గుండె జబ్బులు రాకుండా ఉండే సింపుల్ డైలీ హ్యాబిట్స్ | గుండె ఆరోగ్య రహస్యాలు


ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!


నేటి కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన పద్ధతి లేకుండా చేసే కొన్ని పద్దతులను అవగాహన చేసుకోవడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు చాలామంది ప్రాణాలను బలిగొంటున్న గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో, వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..

నీరు..

రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు గుర్తించారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల మెరుగుదల దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు.

కేవలం ఒకటి రెండు లీటర్ల నీటిని తాగడం పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి పరిమితి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ, ఇతర పానియాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని ఇప్పుడు మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి.

ఆహారం..

ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండటం, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి అల్పాహారం ప్రొటీషన్ ఎంతో శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే!

అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. ఏ ఆహారాన్ని ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు.

అన్నం తినే విషయంలో కూడా వందే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయం చేస్తుంది.

వ్యాయామం..

ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

మీకు నచ్చవచ్చు ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird