Home Latest News ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.! | Nvidia CEO జెన్సన్ హువాంగ్ లవ్ ఎఫైర్ | చైనీస్ గూఢచారి ఆరోపణ | ఆలిస్ హువాంగ్ మెగాస్పీడ్ | US ఇంటెలిజెన్స్ మెమో – Andhra Waves

ఇదో స్పై లవ్ స్టోరీ: ఎన్విడియో సీఈవోకు, అమెరికా గూఢచారితో లవ్ ఎఫైర్.! | Nvidia CEO జెన్సన్ హువాంగ్ లవ్ ఎఫైర్ | చైనీస్ గూఢచారి ఆరోపణ | ఆలిస్ హువాంగ్ మెగాస్పీడ్ | US ఇంటెలిజెన్స్ మెమో – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ప్రపంచ టెక్ రంగంలో అత్యంత ప్రభావమంతమైన వ్యక్తిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తాజాగా హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. ఆయనకు చైనా ప్రభుత్వానికి గూఢచారిగా వ్యవహరిస్తోందనే అనుమానాలున్న ఒక మహిళతో సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా నిఘా సంస్థ సంచలన నివేదికను వెలువరించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. టెక్ ప్రపంచంలో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా సంచలన చర్చగా మారింది.

అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల మెమో ప్రకారం, సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ అనే చైనా మహిళతో జెన్సన్ హువాంగ్ కు లవ్ ఎఫైర్ ఉంది. వీరిరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చైనా ప్రధాన నిఘా సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఈ మహిళను గూఢచారిగా రిక్రూట్ చేసుకుందని అమెరికా ఏజెన్సీలు చెబుతున్నాయి. అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లే ముందు ఈ నిఘాపై అమెరికా ప్రభుత్వంలోని కొద్దిమంది అత్యున్నత అధికారుల సమక్షంలో చర్చించినట్లు సమాచారం.

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది కొద్దిమంది మధ్య ఒక రహస్య మెమో సర్క్యులేట్ అందులో విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు, చైనాకు చెందిన వ్యాపారవేత్త అలిస్ హువాంగ్ లే తో సంబంధాలున్నట్లు తెలియజేసారు. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం అమెరికా టెక్, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ వివాదానికి ప్రధాన కారణం కేవలం వ్యక్తిగత సంబంధాలు మాత్రమే కాకుండా, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు కూడా ముడిపడి ఉండటమే. అమెరికా ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలను ఉల్లంఘించి, ఎన్విడియా తయారుచేస్తున్న అత్యంత శక్తిమంతమైన ఏఐ చిప్స్ చైనాకు తరలుతున్నాయన్న ఆరోపణలపై మెగాస్పీడ్ కంపెనీపై ఇప్పటికే అమెరికా నిఘా పెట్టింది. చైనాకు చెందిన సంస్థలు ఆగ్నేయాసియాలోని డేటా సెంటర్ల ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటింగ్ ప్రాజెక్ట్ పొందేలా చేయడంలో ఈ నెట్‌వర్క్ సహకరించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: బంగారంతో ఆభరణాలే కాదు, రోడ్డు కూడా: దుబాయ్ లో గోల్డెన్ వాక్ వే.!

ఈ ఆరోపణలను ఎన్విడియా యాజమాన్యం ఖండించింది. సీఈఓ హోదాలో జెన్సన్ హువాంగ్ ప్రతిఏటా వేలాది మంది కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌లను కలుపుతారని, అందులో భాగంగానే ఆలిస్ హువాంగ్‌ను కూడా కలిశారని ప్రకటించారు. అన్ని కస్టమర్లతో జరిగే సాధారణ వ్యాపార సమావేశాలు మాత్రమేననీ, వాటిలో జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి సున్నిత హస్యాలు, ట్రేడ్ సీక్రెట్స్ పంచుకోలేదని ఎన్విడియా ప్రతినిధి తెలిపారు. మెగాస్పీడ్ కంపెనీ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ, తాము ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని, అధికారులు విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు.

అమెరికా, చైనా మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల రంగంలో ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో ఈ ఉదంతం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్విడియా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది, వాణిజ్యపరమైన సడలింపుల కోసం టెక్ దిగ్గజాలు లాబీయింగ్ చేస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు: వాలంటరీ ఎగ్జిట్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ ఆఫర్ సరికొత్త వ్యూహం.!

ప్రేమ కోసం ఆస్తులన్నీ అమ్మేశాడు.. తీరా చూస్తే ప్రియురాలు మనిషే కాదు.!

[Nvidia CEO Jensen Huang Love Affair,  Chinese Spy Allegation, Alice Huang Megaspeed, US intelligence Memo, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird