Home ఆంధ్రప్రదేశ్ రోజా: రోజా ఎఫెక్ట్.. పాపం వరుదు కళ్యాణి బలి అయిపోయింది.. – Andhra Waves

రోజా: రోజా ఎఫెక్ట్.. పాపం వరుదు కళ్యాణి బలి అయిపోయింది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


రోజా: వైసీపీలో మహిళా నేతగా.. మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. విద్యావంతురాలు.. రాజకీయాల మీద పట్టుంది. ఈ నేపథ్యంలో ఈమె విశాఖపట్నం మేయర్ పదవికి పోటీ చేశారు. నిజానికి ఈమె ప్రచారాన్ని చాలా సవాల్ గా తీసుకొని చేశారు. పార్టీ అధినేత జగన్ రాకపోయినప్పటికీ.. నాయకులు అండదండలు అందించకపోయినప్పటికీ కళ్యాణి క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. ఆమె చేసిన ప్రచారం చూస్తే చాలామంది విశాఖపట్నం టిడిపి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి కి గట్టి […]

రోజా: వైసీపీలో మహిళా నేతగా.. మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. విద్యావంతురాలు.. రాజకీయాల మీద పట్టుంది. ఈ నేపథ్యంలో ఈమె విశాఖపట్నం మేయర్ పదవికి పోటీ చేశారు. నిజానికి ఈమె ప్రచారాన్ని చాలా సవాల్ గా తీసుకొని చేశారు. పార్టీ అధినేత జగన్ రాకపోయినప్పటికీ.. నాయకులు అండదండలు అందించకపోయినప్పటికీ కళ్యాణి క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు.

ఆమె చేసిన ప్రచారం చూస్తే చాలామంది విశాఖపట్నం టిడిపి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి కి గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. మహా అయితే శ్రావణి 20,000 లేదా 30,000 ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే.. కళ్యాణి జన్మలో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. శ్రావణి కళ్యాణి మీద ఏకంగా 2,40,000 ఓట్లకు పైచిలుకు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కళ్యాణి పొలిటికల్ కెరియర్ మొత్తం మటాష్ అయిందని చర్చ నడుస్తోంది.

విశాఖపట్నంలో కళ్యాణి మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఆస్థానం కేటాయించడం ఒక రకమైన చర్చకు దారితీసింది. అయితే, వైసీపీకి లేకపోవడంతో ఆమెను తెరమీదకు తీసుకొచ్చారని. కళ్యాణికి మాజీ మంత్రి రోజా విశేషాలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆమె విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా గెలవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత కళ్యాణికి డౌన్ ట్రెండ్ మొదలైందని.. టిడిపి కార్యకర్తలు ఇదే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసారు.

కళ్యాణి ఓడిపోయిన నేపథ్యంలో దీనంతటికీ కారణం రోజా అని.. గతంలో రోజా ఎవరికీ విశేషాలు చెప్పినా సరే వారంతా ఓడిపోయారని కూటమినేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రోజా ఎఫెక్ట్ వల్ల కళ్యాణి బలి అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి విశాఖపట్నంలో కూటమికి బలం విపరీతంగా పెరిగిపోయింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు కూడా ప్రజల ఆలోచన పూర్తిగా మార్చివేశాయి. అందువల్లే శ్రావణి కి ఓటర్లు జై కొట్టారు. కానీ నేతలు రోజాను టార్గెట్ చేసి కూటమి విమర్శలు చేస్తున్నారు. దీంతో రోజా వర్గం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. మరోవైపు రోజా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నగరి నియోజకవర్గంలో టిడిపి మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, రోజా ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థులలో ఆరుగురు మాత్రమే విజయాలు సాధించారు. నగరంలోనే రోజాకు దిక్కులేదు.. కళ్యాణికి ఏం సపోర్ట్ చేస్తుంది.. రోజా సపోర్ట్ తో మేయర్ అవుదామని కళ్యాణి ఎలా అనుకుని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird