
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ పంచాయతీలు మరోసారి తెరమీదకు వచ్చాయి. పెద్ద ఎత్తన చర్చకు తెరలేపాయి. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరిసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబాల మధ్య విభేదాలు, విభేదాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు, అసలు మేనకోడలి వివాహ వేడుకకు జగన్ హాజరౌతారా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలకు సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం ఏర్పాటు చేయబడింది వైఎస్ షర్మిల జగన్ అనుమతి. అయితే భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ ఆ ప్రాంగణాన్ని వివాహ వేడుకకు ఉపయోగించేందుకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఈ విషయంలో మరోసారి అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
కుటుంబ భవనంలో వివాహం జరగ, వివాహ వేదికను వేరే మారుస్తున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అదే సమయంలో అసలు ఎలహంక తన ఆస్తి అని కూడా విస్పష్టంగా ప్రకటించారు. అయితే కుమార్తె వివాహం నేపథ్యంలో తగాదాలు, అనవసరమైన వివాదాలు ఎందుకని భావించి వేదికను మార్చినట్లు ఆమె ఆ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 25న జరగనున్న ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరూ హాజరు అవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ ప్రదర్శన.
.webp)
గతంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ తన సతీమణితో కలిసి హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కుటుంబ వేడుక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు మరింత ముదిరాయి.
ఇది కూడా చదవండి: యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.!
తాజాగా ఇప్పుడు కుమార్తె వివాహం సందర్భంగా చోటుచేసుకున్న వేదిక మార్పు వివాదం నేపథ్యంలో.. ఈ వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సొంత చెల్లెలు కుమార్తె వివాహ వేడుకకు మేనమామ హోదాలో జగన్ హాజరైన ఆశీర్వదస్తారా లేక ఈ దూరంగా ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ అనీల్ రెడ్డి ఇంటో వివాహ వేడుకకు వేదిక. ఏపీలో మునిసిపల్, పరిషత్ ఎన్నికల కారణంగా జగన్ పొలిటికల్ గా చాలా బీజీ అయినా, వెసులుబాటు పొంది చెన్నై వెళ్లి మరీ ఆ వివాహానికి హాజరయ్యారు. మరి ఇప్పుడు సొంత చెల్లెలి కుమార్తె వివాహానికి హాజరౌతారా? లేక చెల్లెలితో ఉన్న విభేదాల కారణంగా ముఖం చాటేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
మీకు నచ్చవచ్చు: యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.!
ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.?
[Will Jagan Attend YS Sharmila Daughter Wedding, Yelahanka Palace Controversy, YSR family Disputes, Anjili Reddy wedding, Telugu One]
