Home Latest News జగన్ కోటకు బీటలు: తెలుగుదేశం బలుపా, వాప: కడప మేయర్, పులివెందుల చైర్ పర్సన్ గెలుపే గీటురాయి.! | కడప స్థానిక సంస్థల ఎన్నికలు | టీడీపీ ఏకగ్రీవ విజయం | వై సీపీ బస్తీ పులివెందుల | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు – Andhra Waves

జగన్ కోటకు బీటలు: తెలుగుదేశం బలుపా, వాప: కడప మేయర్, పులివెందుల చైర్ పర్సన్ గెలుపే గీటురాయి.! | కడప స్థానిక సంస్థల ఎన్నికలు | టీడీపీ ఏకగ్రీవ విజయం | వై సీపీ బస్తీ పులివెందుల | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీకీ, జగన్ కీ పెట్టని కోటగా నిలిచిన కడప కోట బీటలు వారింది. కడప గడపలో వైపీపీ పట్టు కోల్పోయింది. స్థానిక సమరంలో మెజారిటీ స్థానాల్లో కనీసం నామినేషన్ కూడా వేయలేని దయనీయ స్థితిలో నిలిచారు. స్థానిక సమరంలో కడప జిల్లా లో వైసీపీ చేతులెత్తేసింది. రాజంపేట, బద్వేల్, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు వంటి కీలక నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ విజయాలు సాధించారు. అన్నిటికీ మించి జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో వైసీపీనూ చతికిలపడింది.

పులివెందుల మునిసిపాలిటీలో సగానికి పైగా వార్డులను తెలుగుదేశం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పులివెందులలోనే వైసీపీకి అభ్యర్థులు కరవయ్యారని ఈ పరిణామం తేటతెల్లం చేసింది. దశాబ్దాలుగా కుటుంబం ఆధిపత్యం కొనసాగిన పులివెందులలో జగన్ పార్టీ వైసీపీ అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఏర్పడడాన్ని బట్టి ఆ పార్టీ దయనీయ స్థితి కళ్లకు కడుతుంది. ఈ ఏకగ్రీవాలతో వైపీపీ కడపలో వెనకడుగు వేసిందని తేటతెల్లమైౌతోంది. అయితే ఇక్కడ వైసీపీ తెలుగుదేశం పై చేయి సాధించిన పరిస్థితి, నిజమైన విజయంగా భావించి సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎదుటి పక్షం అంటే వైసీపీ చేతులెత్తేయడం వల్ల పోటీ లేకుండా వచ్చిన విజయాలివి. అందుకే వీటిని సాంకేతిక విజయాలుగానే తెలుగుదేశం భావించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో కూటమి నాయకులు సమన్వయంతో వ్యవహరించడం, వ్యూహం సాగడం వల్లే ఇది సాధ్యమైంది. గతంలో వైకాపా ఏకపక్షంగా గెలుపొందిన ప్రాంతాల్లోనూ ఇప్పుడు కూటమి పార్టీలు బలాన్ని చాటాయి.

అది పక్కన పెడితే ఏకగ్రీవాల కారణంగా వైసీపీ.. తెలుగుదేశం అధికార బలంతో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజానికి ప్రజా మద్దతు లేకపోవడం వల్లనే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. లేకుంటే పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలలో రికార్డు సృష్టించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు నామినేషన్లు వేయడానికి వీలులేని పరిస్థితులను సృష్టించడం ద్వారా ఆ రికార్డు సాధించారు. ఇప్పుడు తెలుగుదేశం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుత కడప కార్పొరేషన్ మేయర్, పులివెందుల మున్సిపాల్ చైర్ పర్సన్ స్థానాలకు జరిగే ప్రత్యక్ష పోలింగ్‌లోనే అసలైన ఓటర్ల తీర్పు తేలనుంది. ఇంకా ఓటింగ్ జరగాల్సిన కడప మేయర్, పులివెందుల మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఓట్ల రూపంలో విజయం సాధిస్తేనే, ఈ ఏకగ్రీవాలకు సార్థకత చేకూరుతుంది. ఆ స్థానాలను గెలుచుకోలేని పక్షంలో లేనిపక్షంలో, కేవలం నామినేషన్ల ఉపసంహరణలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగిన ఏకగ్రీవ విజయాలు వాపే కానీ బలుపు కావని పరిశీలకులు అంటున్నారు.

ఏది ఏమైనా కడప పరిణామాలు వైసీపీ అధినేత జగన్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఈ ఏకగ్రీవలు వైసీపీ శ్రేణులలో కూడా నిరుత్సాహాన్నీ, నిస్తేజాన్నీ నింపిన పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే కడప మేయర్, పులివెందుల చైర్ పర్సన్ స్థానాల్లో విజయం సాధిస్తేనే ఈ ఏకగ్రీవాలకు సార్ధకత, ఈ విజయాలకు గుర్తింపు లభిస్తుందని అంటున్నారు. అంత వరకూ కడపలో నిజంగా వైసీపీ నుంచి తెలుగుదేశానికి ఓటు బ్యాంకు బదలీ అయ్యిందని చెప్పడానికి అవకావాలు లేవు.

[Kadapa Local Body Elections, TDP Unanimous Wins, Y CP Bastion Pulivendula, Andhra Pradesh Politics, TeluguOne News]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird