Home Latest News జంతువుల నుంచి మనుషులకు బెంబేలెత్తిస్తున్న మరో మహమ్మారి: షమొండా వైరస్.! | మానవజాతిని బెదిరిస్తున్న కొత్త పెండమిక్ | షామోండా వైరస్ | ఫ్రాన్స్ | మానవ మరణం | జంతువులు మానవ షామోండా వైరస్ | వ్యాప్తి – Andhra Waves

జంతువుల నుంచి మనుషులకు బెంబేలెత్తిస్తున్న మరో మహమ్మారి: షమొండా వైరస్.! | మానవజాతిని బెదిరిస్తున్న కొత్త పెండమిక్ | షామోండా వైరస్ | ఫ్రాన్స్ | మానవ మరణం | జంతువులు మానవ షామోండా వైరస్ | వ్యాప్తి – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


మహమ్మారి మృత్యు పంజా విషాద జ్ఞాపకాల నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అంతలోనే ప్రాణాంతక మహమ్మారి విజృంభణకు రంగం సిద్ధమైందన్న వార్తలు బెంబేలెత్తిపోతున్నాయి. వ్యాధి కాకుండా పలు రకాల వైరస్ లు మానవ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన తరుణంలో మరో కొత్త వైరస్ కోరలు చాస్తోందన్న వార్త మానవాళిని భయపెడుతోంది. ఈ కొత్త మహమ్మారి పేరు షమొండా వైరస్. ఇంత కాలం ఈ వైరస్ జంతువులలోనే కనిపించింది. కానీ తాజాగా ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకూ వ్యాపిస్తోందన్న సంకేతాలు వెలువడ్డాయి.

ఫ్రాన్స్‌లో ఈ షమొండా వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించాడు. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో ఈ వైరస్ పశువుల్లో వ్యాపించింది. అయితే ఈ మహమ్మారి జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తి చెందుతుందన్న వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. లియోన్ ఓ వ్యక్తి షమొండా వైరస్ సోకి మృత్యు ఒడికి చేరాడు.

షామొండా వైరస్‌ను మొట్టమొదటిసారిగా 1965లో నైజీరియాలో శువులలో పేర్కొన్నారు. కాలక్రమేణా ఇది యూరప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ వంటి స్పెయిన్, ఐర్లాండ్ ప్రాంతాలకు విస్తరించింది. సాధారణంగా ఈ వైరస్ సన్నని ఈగలను పోలిన మిడ్స్ అనే కీటకాలు లేదా ఈగల కాటు ద్వారా జంతువులకు వ్యాపిస్తుంది. పశువులకు ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, విరేచనాలు రావడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం కావడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కలుగుతాయి.

ఇప్పటివరకు జంతువులకే పరిమితమైన ఈ వైరస్ మొదటిసారిగా ఫ్రాన్స్‌లో ఒక మనిషి ప్రాణాలను బలిగొనడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ అరుదైన వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదని అంటున్నారు. పశువుల పెంపకం నిర్వహించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈగలు, దోమల కాటు నుంచి రక్షణ పొందడానికి తగిన నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.

మనుషుల్లో ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది, ఇది తర్వాత మనిషిలో వచ్చే అనారోగ్య లక్షణాలేంటి, వాటి తీవ్రత ఎంత అన్న దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, పశువుల నుంచి మనుషులకు సోకే ఇన్ఫెక్షన్ల జాబితాలో షమొండా వైరస్ చేరడం ఆందోళన కలిగిస్తోంది.


[New Pendamic Threatening Mankind, Shamonda virus, France, Human Death, Animals Human  Shamonda Virus, Spread, Telugu One]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird