
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన కోనేటి ప్రదీప్ అనే వ్యక్తి.. పెళ్లి పేరుతో మహిళకు దగ్గరై, మూడేళ్లుగా వివాహం చేసుకోకుండా కాలయాపన చేస్తూ రూ.1.18 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా, మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానని బెదిరించి మరో రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
మ్యాట్రిమోనీ పరిచయం.. ఆపై మోసం.!
కమ్మ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా బాధితురాలికి పరిచయమైన ప్రదీప్.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నట్లు గుర్తించారు. ఈ వివిధ కారణాలు చెబుతూ ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా పెళ్లి ప్రస్తావనను వాయిదా వేస్తూ వచ్చిన నిందితుడు.. చివరకు వ్యక్తిగత ఫొటోలను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.

పాత కేసుల్లోనూ నిందితుడే.!
పోలీసుల సమాచారం ప్రకారం, కోనేటి ప్రదీప్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. మేడిపల్లి పరిధిలో నమోదైన ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు, గోల్కొండ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై రెండు గంజాయి కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రదీప్ చేతిలో మరికొందరు మహిళలు కూడా మోసపోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిమాండ్‌కు తరలింపు.. మరిన్ని వివరాలపై ఆరా.!
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు వచ్చారు. ప్రదీప్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని బాధితుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని. బాధితురాలి నుంచి వసూలు చేసిన నగదు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు, ఇతర మహిళలతో అతడికి ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
[ Koneti Pradeep, Medipally Police, Matrimony Fraud, Marriage Scam, Kamma Matrimony, Matrimonial Website Fraud, ₹1.18 Crore Fraud, Blackmail Case, Personal Photos Threat, Cybercrime, Hyderabad Crime News, Medipally Police Station, Woman Cheated on Marriage Promise, hyderabad police, CP Sajjanar, DGP C.V.Anand ]
