భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు. ప్రభుత్వ అధికారుల అవినీతి వ్యవహారాలపై కొనసా గుతున్న తనిఖీల్లో, భాగంగా ప్రభుత్వ శాఖకు చెందిన ఇద్దరు బృందం భారీ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతపురి సుజాత అనే మహిళ భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) గా పనిచేస్తుంది. అలాగే భద్రాద్రిగూడెం కొత్త జిల్లాకు చెందిన తేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO) మరియు చర్ల ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భూక్య కృష్ణ పనిచేస్తున్నారు.
అయితే భద్రాద్రి కొత్తగూడెం మండలం చర్ల మండలం పుష్పగుప్పం నుంచి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు 2025లో 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనుల సందర్భంగా కొన్ని చెట్లను నరికి గ్రామం నిర్మించడం జరిగింది… దీనితో వ్యక్తిపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ని బాధితుడు శాఖ అధికారులను కలిశాడు. అయితే బీటీ రోడ్డు పనుల సందర్భంగా, కొన్ని చెట్లకు నష్టం జరిగిందన్న ఆరోపణలపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు, అలాగే భవిష్యత్తులో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని చెప్పి ఈ ఇద్దరు అధికారులు ఫిర్యాదిదారుడిని లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
మొదటగా రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసిన అధికారులు, తర్వాత ఫిర్యాదుదారుడి అభ్యర్థనతో మొత్తం రూ.3.50 లక్షలకు తగ్గించారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ కోరనే ఏసీబీ అధికారులు వలపన్ని ఈరోజు ఇద్దరు అధికారులు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం,ఈ ఇద్దరు అధికారుల నుండి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు… నిందితులను అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసా గుతోంది. నిందితులు తమ అధికారిక పదవులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లాభం పొందే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదిదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్(9440446106), సోషల్ మీడియా వేదికలు మరియు ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారులకు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు .
.webp)