Home Latest News జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ కేసులో..వెలుగులోకి విస్తుపోయే విషయాలు | జూబ్లీహిల్స్ ఉచ్చు, అత్యాచారం కేసులో షాకింగ్ వివరాలు | చిన్న | అమ్మాయిలు | instagram – Andhra Waves

జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ అండ్ రేప్ కేసులో..వెలుగులోకి విస్తుపోయే విషయాలు | జూబ్లీహిల్స్ ఉచ్చు, అత్యాచారం కేసులో షాకింగ్ వివరాలు | చిన్న | అమ్మాయిలు | instagram – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికల ట్రాప్ అండ్ ర్యాప్ చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన అర్జున్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్, రాజీవ్ జూబ్లీహిల్స్ లోని బడా బాబుల కూతుర్లను టార్గెట్ గా చేసుకొని వారిని ట్రాప్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి మొత్తం 19 మంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ దాదాపు మూడు గంటల పాటు నిందితులను స్వయంగా విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్‌ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు. మైనర్ బాలికలు తనకు అట్రాక్ట్ అయ్యేలా అర్జున్ ఇంస్టా గ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసేవాడు.

అలా మొదటగా స్నేహంగా ప్రారంభమై.. చాటింగ్ తర్వాత నెమ్మదిగా వ్యక్తిగత పరిచయాలు పెంచుకుంటూ వలలోకి దింపారు. ఖరీదైన కార్లలో డ్రైవ్స్, లైఫ్ స్టైల్ చూపిస్తూ నమ్మకం పెంచుకున్నారు. ఇలా అర్జున్ ఇంస్టాగ్రామ్ ను మొత్తం 150 మంది బాలి కలలు ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగలేదండోయ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు లగ్జరీ కార్లలో తిప్పుతూ తమతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవా లంటూ ఒత్తిడి చేసేవారు. కొన్ని సందర్భాల్లో మైనర్ బాలికలతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు కూడా నమోదు చేయబడ్డాయి. తాము త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని అందుకు కొంత డబ్బు అవసరం ఉందని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. అలా ఒక మైనర్ బాలిక నుండి 13 లక్షల రూపా యలు వసూలు చేశారు. మైనర్ బాలిక ఇంట్లో ఈ వ్యవహారం తెలియడంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ ఇద్దరు అన్నదమ్ములకు తల్లి మీనా కుమారి సహకరి స్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా అర్జున్ ఓ 3 మంది బాలికను ట్రాక్ చేసిన కేసులో రోజుల పాటు జైలుకు వెళ్లి తిరిగి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం అర్జున్ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లాక్ చేసి. దర్యాప్తు ముమ్మరం చేశారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird