భారత రాజకీయ పటంలో కీలక మలుపుగా కనిపిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై, ఎగ్జిట్ పోల్స్ ఒక దిశ చూపితే, నియోజకవర్గ స్థాయి రిపోర్టులు మరో భిన్నమైనవి. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో బీజేపీ ఆధ్వర్యంలో కూటములకు లాభాలు, కేరళలో వామపక్షానికి దీర్ఘకాలిక సంక్షోభ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకుల అంచనా. అయితే.. ఎగ్జిట్ పోల్స్ కు.., వాస్తవ డేటా లేదని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా అసోం, బెంగాల్, తమిళనాడులో బీజేపీకి పాజిటివ్ ట్రెండ్ ప్రారంభమైందని క్షేత్రస్థాయి నివేదికలు సూచిస్తున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ భారత ఎన్నికల సంస్కృతిలో ఒక పెద్ద మీడియా ఈవెంట్‌గా మారిపోయినా.. వాటి పద్ధతి, నమూనా ఎంపిక, పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి గ్రౌండ్ డేటా, స్థానిక సమీకరణలు, అభ్యర్థుల సామాజిక బలం, మైక్రో-కాస్ట్ డైనమిక్స్ ఇవన్నీ ఫలితాలపై ప్రభావం చూపుతాయి.
సీరియస్ డేటా డ్రివెన్ సర్వేలు ఒకవైపు, టీఆర్పీల కోసం రూపొందించిన నారేటివ్ పోల్స్ మరోవైపు.. ఈ రెండింటినీ కలిపేసి మీడియా జనాభిప్రాయం గా అమ్ముతున్నదని అంటున్నారు. బూత్ స్థాయి వర్కర్ల ఫీడ్ బ్యాక్, స్థానిక సమీకరణలు, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్… గత ఎన్నికల ఓటు మార్పిడి ఇవన్నీ కలిపి ఎగ్జిట్ పోల్స్ కంటే విశ్వసనీయ సూచికలంటున్నారు.
అసోం రాష్ట్ర రాజకీయాలను గుర్తించే, అక్కడ అధికార ఎన్డీయే (ఎన్డీయే ) కూటమి హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నట్లు. గత రెండు ఎన్నికల్లో (2016, 2021) విజయం సాధించిన బీజేపీ.. ఈసారి విపక్షాల ఐక్యత లోపించడాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వల్ల కూడా హిందూ ఓట్ల సమీకరణం బలపడిందని, దీనితో ఎన్డీయే సుమారు 84 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్కడ గెలుపు ఎవరిదనే దానికంటే, మెజారిటీ ఎంత అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో ఈసారి చరిత్రాత్మక మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. ఓటరు జాబితాలో అక్రమ ఓట్ల తొలగింపు, కేంద్ర బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత వంటి అంశాలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి సవాలుగా మారాయి. వలస కార్మికులు భారీగా స్వస్థలాలకు తిరిగి వచ్చి ఓటు వేయడం కూడా ఫలితాలపై ప్రభావం చూపనుంది.
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు మరియు క్రైస్తవ సామాజిక వర్గాల్లో అసంతృప్తి కారణంగా యూడీఎఫ్ ) పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. ఇది కేరళలో వామపక్షాల పతనానికి ఆరంభం కావచ్చని, బెంగాల్, త్రిపుర తరహాలోనే ఇక్కడ కూడా కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే మరియు ఏఐఏడీఎంకే కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కొంత మంది నటుడు విజయ్‌కి భారీ సీట్లు వస్తాయని అంచనా వేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అది కేవలం ఓట్ల చీలికకే పరిమితం కాబోతుంది. డీఎంకే పాలనపై కొంత అసంతృప్తి నెలకొన్న తరుణంలో, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. కేవలం ఈ ఎన్నికలే కాకుండా, భవిష్యత్తు రాజకీయాల కోసం బీజేపీ అక్కడ ఒక పటిష్టమైన పునాదిని నిర్మిస్తోంది. ముగింపుగా చూస్తే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు భారత రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. తూర్పు మరియు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించడం, దేశవ్యాప్తంగా వామపక్షాల ప్రభావం తగ్గడం వంటి అంశాలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. కామ్, ఎగ్జిట్ పోల్స్ లేదా విశ్లేషణలు అనేవి కేవలం అంచనాలు మాత్రమేనని, తుది తీర్పు అనేది ఎలక్షన్ కమీషన్ వెల్లడించిన ఫలితాలపైనే ఉన్నట్లు గుర్తుంచుకోవాలి.
– సీతారాం కంఠంనేని
సూచనలు
భారత ఎన్నికల సంఘం – అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు) Wikipedia StatisticsTimes.com ఫలితాలు విశ్వవిద్యాలయం
పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలో వామపక్షాల క్షీణతపై ఆర్థిక & రాజకీయ ధోరణి విశ్లేషణలు ది సెంటినల్ అస్సాం
వివిధ పోల్ అనంతర విశ్లేషణాత్మక నివేదికలు మరియు నియోజకవర్గ-స్థాయి అధ్యయనాలు (గ్రౌండ్ రిపోర్ట్‌లు, పార్టీల వారీగా ఓటు షేర్ ట్రెండ్‌లు, 2016–2024)
ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి https://www.teluguone.com ఫాలో అవ్వండి. భాగస్వామ్యం చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.
