ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ఆవిరైపోయాయి. ఎస్కే బ్యాటర్, స్కిప్పర్ రుజురాజ్ సింగ్, కార్మిక శర్మలు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముంబై పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. ఇక చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ అద్భుత ప్రదర్శన కనబరిచి కీలక మూడు వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. తోడుగాూర్ అహ్మద్ అతనికి రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రమబద్ధమైన బౌలింగ్‌తో చెన్నై బౌలర్లు ముంబైని కట్టడి చేశారు.
అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సంజూ శాంసన్ 11 పరుగులు, ఉర్విల్ పటేల్ 24 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే.. ఆ దశలో స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు కార్తీక్ శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై చేతుల్లోంచి లాగేసుకున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలవగా, కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. దీనితో చెన్నై లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.
