ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం లేదు.
గతంలో మావోయిస్టులు అమర్చిన ఐడీలను గుర్తించి నిర్వీర్యం కోసం డిస్క్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బృందం మైన్ల తొలగింపు ఆపరేషన్ చేస్తోంది. శనివారం (మే 2) మైన్‌ల నుండి దూరంగా ఉండగా ప్రమాదవశాత్తూ ఐడీ పేలింది. దీంతో నలుగురు డీఆర్జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
.webp)