ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ ను ఆయన నివాసంలో చంద్రబాబు నేడు కలిసి పరామర్శించారు. సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అంటే కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
.webp)
