విజయ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో భారీ పీరియడ్ డ్రామా ‘రణబాలి’, రవి కిరణ్ కోల దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ చిత్రాలతో ప్రస్తుతం ఉన్న విజయ్.. రీసెంట్ గా క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ‘హాయ్ నాన్న’ సినిమాతో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తర్వాత సినిమా (#VDxShouryuv) అధికారికంగా ప్రకటించారు.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఎంట్రీ?
ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (కృతి సనన్) నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహేష్ బాబు హీరోగా నటించిన ‘1: నేనొక్కడినే’ సినిమాతోనే హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టింది. నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి తెలుగు హీరో సరసన నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ – కృతి జంట వెండితెరపై సరికొత్త కెమిస్ట్రీని పంచుతారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని సమాచారం. దీనికోసం గ్లోబల్ స్థాయిలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపారు. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఫేమ్ అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రాఫర్ గా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సూపర్వైజర్ గా ఎరిక్ డర్స్ట్ వర్క్ చేస్తున్నారు. మ్యూజిక్ బాధ్యతలను మాత్రం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఉన్నారు.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం ‘మైథాలజికల్ యూనివర్స్’ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా అని. ఇటీవల విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. విజయ్ ఒక రాయల్ లుక్‌లో కనిపిస్తూ క్రూరమైన కుక్కలను చైన్‌తో పట్టుకున్న పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.
విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

