అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గా ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అమెరికా పార్లమెంటులో రక్షణ మంత్రిని పీట్ హెగ్‌సెట్‌ను ఎంపీ సారా జాక్సబ్ ..మీ అధ్యక్షుడికి మతి స్థిమితం ఉందా? అని ప్రశ్నించారు. తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెట్ ఇలాంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్‌ను అడిగారా అంటూ ఎదురు దాడి చేశారు. దీనికి సారా జాకబ్స్ కూడా ఏడాదిన్నరగా అధ్యక్షుడిగా ట్రంపే నంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ పటిమపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా చేస్తున్న పోస్టులు, అర్ధరాత్రి పూట చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ‘ట్రాంప్ మానసిక స్థితి అసలు నిలకడగానే ఉందా” అనే చర్చ తెరపైకి వచ్చింది. నిలదీశారు.
తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెట్.. గత నాలుగేళ్లలో జో బైడెన్ విషయంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దానికి జాకబ్స్ సూచనూ .. బైడెన్ ఇప్పుడు అధ్యక్షుడు కాదు. ఏడాదిన్నరగా ట్రంప్‌లో అధికారం ఉన్నారని బదులిచ్చారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హెగ్సెట్.. తమ అధ్యక్షుడిని కించపరిచేలా అడిగే ఈ ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వనని, సైన్యాన్ని అగ్రస్థానంలో నిలిపే గొప్ప నాయకుడని వెనకేసుకొచ్చారు.
ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో.. ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్‌లు అమెరికా ప్రజలను కలవరపెడుతున్నాయి. ఒక సందర్భంలో ఆయన.. “ఇరాన్ నా డిమాండ్లను అంగీకరించకపోతే.. నేటి రాత్రి వారి నాగరికత అంతమైపోతుంది” అంటూ తీవ్ర స్థాయిలో పేర్కొన్నారు. అతడిని తాను దైవంగా చిత్రించుకునేలా ఏఐ ద్వారా రూపొందించిన పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. తన చేతుల నుంచి దివ్య కాంతి వస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోను తొలగించిన ట్రంప్.. తాను ప్రజల కష్టాలు తీర్చే వైద్యుడు లాంటి వాడిని సర్దిచెప్పుకున్నారు. ఆ దిశగా ట్రంప్ మెంటల్ బ్యాలెన్స్‌పై తిరిగి చర్చ మొదలవ్వడంప్రాధాన్యత సంతరించుకుంది.
