Home సినిమా తెలుగులో జెట్లీ మూవీ రివ్యూ: జెట్లీ మూవీ రివ్యూ – Andhra Waves

తెలుగులో జెట్లీ మూవీ రివ్యూ: జెట్లీ మూవీ రివ్యూ – Andhra Waves

by
0 comments
తెలుగులో జెట్లీ మూవీ రివ్యూ: జెట్లీ మూవీ రివ్యూ



-సినిమా పేరు: జెట్లీ
-న’టీన’ట్లు: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, , వైవా హర్ష, -గెటప్ శ్రీను,తదితరులు
-సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
-ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
-మ్యూజిక్:కాల భైరవ
-నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు
-సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్
-బ్యానర్ : క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
-రచన,దర్శకత్వం: రితేష్ రానా
-రిలీజ్ డేట్ : మే 1 2026

మత్తు వదలరా పార్ట్ 1 , పార్ట్ 2 తో విభిన్న టేకింగ్ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రితేష్ రానా ఈ రోజు మరోసారి ‘జెట్లీ'(జెట్లీ)తో టేక్ ఆఫ్ అయ్యాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పించడం, కమెడియన్ సత్య హీరోగా రావడం జెట్లీ స్పెషాలిటీ. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

ప్రజాపతి(అజయ్) ఒక బ్యాంక్ అధినేత. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సెక్యూరిటీకి చెందిన పోలీస్ ఆఫీసర్ శివాని రాయ్ ((రియా సింఘా) ప్రజాపతిని దుబాయ్‌లో బంధించి తన టీంతో ఫ్లైట్‌లో ఇండియాకి తీసుకువస్తాడు. ఫైటర్ గా ఫ్లైట్ లో తన హీరోయిజాన్ని చూపిస్తాడు ఎవరు?

ఎనాలసిస్
సింపుల్ అండ్ సింగిల్ పాయింట్‌తో నడిచే కథనాన్ని విసుగు పుట్టించకుండా చేయడంలో రితీష్ రానా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథ మొత్తం ఫ్లైట్ లోనే జరుగుతుంది. ఆ విషయాన్నీ తెలియకుండా అద్భుతమైన టేకింగ్ తో మెస్మరైజ్ చేసాడు. పెర్ఫార్మ్ పరంగా ఆల్ ఆర్టిస్ట్స్ విజృంభించారు. ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్ పెర్ఫార్మ్ పీక్. పైగా కొత్త బాడీ లాంగ్వేజ్ తో ఫ్రెష్ నెస్ ని తేవడం జెట్లీ కి ప్రధాన ప్లస్ .కానీ డైలాగ్స్ విషయంలో ఇంగ్లీష్, హిందీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రితీష్ రానా ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సింది.

ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మొదటి సీన్ తోనే జెట్లీ ఎంత వెరైటీ గా ట్రావెల్ చేయబోతుందో అర్ధమవుతుంది. సత్య ఇంట్రడక్షన్, ప్రజాపతి బ్యాంక్ సీన్స్, ఫ్లైట్ లో వచ్చే కామెడీ సీన్స్, శివాని రాయ్ సీన్స్ ఇలా అన్ని కొత్త రకం మాడ్యులేషన్ తో ఉన్నాయి. ముఖ్యంగా ఒక సీరియస్ విషయాన్నీ ప్రయాణికులకి అనౌన్స్ మెంట్ తో చెప్పే పైలెట్ వాయిస్ అయితే నవ్వులు పూయించింది. ప్రతి పది నిమిషాలకి కథలో ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ పండింది.

ఇంటర్వెల్ ట్విస్ట్ నార్మల్. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కి తగ్గట్టు సరదగానే సాగింది. కొన్ని సీన్స్ విషయంలో కన్ఫ్యూజ్ ఉన్నా వ్యాస్, శివాని మధ్య వచ్చే సీన్స్, సత్య వ్యాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఫ్రీ క్లైమాక్స్, బాగున్నా క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
సత్య పూర్తి ఎనర్జీ తో మెప్పించడమే కాకుండా నవ్వులు కురిపించాడు. వెన్నెల కిషోర్ కూడా అంతే. మరో సారి తాను ఎంత వాల్యుబుల్ నటుడో నిరూపించాడు.స్పెషల్ ఆఫీసర్ గా రియా సింగ్ మెస్మరైజ్ చేసింది. ఎంత అందంగా ఉందో తన పెర్ఫార్మ్ అంతే అందంగా ఉంది. అజయ్, కబీర్ బేడీ, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తో మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. రితేష్ రానా దర్శకుడిగా సక్సెస్. రైటర్ గా మాత్రం మెప్పించలేకపోయాడు. తను సృష్టించుకున్న క్యారెక్టర్స్ ప్రకారం అచ్చ తెలుగు డైలాగ్స్ ఎక్కువగా ఉండకూడదని అనుకోవచ్చు. కానీ చూసేది తెలుగు ప్రేక్షకులే అనే లాజిక్ ని మిస్ అయ్యాడు. పైగా స్క్రీన్ పై ఉంది సత్య, వెన్నెల కిషోర్.. సురేష్ సారంగం తన అద్భుతమైన ఫొటోగ్రఫీతో అతి పెద్ద బలంగా నిలిచాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా కాపాడింది. సాధారణంగా ఇలాంటి చిత్రాలలో నిర్మాణ విలువలని ఊహించలేం. కానీ చిరంజీవి, మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ కి తగ్గట్టుగా నిర్మాణ విలువలని సృష్టించారు. కాలభైరవ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా మెరుపులు ఏం లేవు

బలాలు
1 . డైరెక్షన్
2 . సత్య, వెన్నెల కిషోర్ తో పాటు అందరి పెర్ ఫార్మెన్స్
3 . డిఫరెంట్ స్క్రీన్ ప్లే
4 . కొన్ని కామెడీ సీన్స్
5. ప్రీ క్లైమాక్స్

బలహీనతలు
1 . కొత్తదనం లేని కథ
2 . హిందీ, ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువగా రన్ అవ్వడం
3 . క్యారెక్టర్స్ డిజైన్ లో ఉన్న కన్ఫ్యూజ్
4 . క్లైమాక్స్ ని సరిగా డిజైన్ చేయకపోవడం

చివరిగా చెప్పాలంటే నటినటుల ఫన్ పెర్ఫార్మెన్స్ తో పాటు డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచం బెటర్.


రేటింగ్ 2 .5/5

అరుణాచలం

నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు/అభిప్రాయాలు రచయిత పంచుకున్న వ్యక్తిగత అభిప్రాయాలు/అభిప్రాయాలు మరియు సంస్థ వాటికి బాధ్యత వహించదు. వీక్షకుల విచక్షణతో వారికి ప్రతిస్పందించే ముందు సలహా ఇవ్వబడుతుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird