
చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరభ్యంతర పర్యవేక్షణ చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
మండలంలో సరఫరాలో ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలి
బడి బాట ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి
స్వయంగా బడి బాట కార్యక్రమంలో నేను పాల్గొంటా
వన మహోత్సవం ద్వారా ఒక్కరు ఒక మొక్క నాటెల చర్యలు తీసుకోవాలి చిగురు మామిడి మండలం పచ్చదనంతో నిండిపోవాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించాలి
ముద్ర , కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్ర మండల కార్యాలయాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలపై సంబందించిన అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు,వేసవిలో సరఫరాలో ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు , ఇందిరమ్మ ఇండ్లలో, బడిబాట కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచడం,వర్షకాలంలో వన మహోత్సవం ద్వారా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెల చర్యలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
చిగురు మామిడి మండలంలో 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా 7 ఎమ్మార్వో, 7 ఎంపీడీఓ, 7 వ్యవసాయ అధికారి ఇంచార్జి గా ఉంటారని మొత్తానికి డిపిఓ నిలకడగా ఉన్న అధికారులను స్వాధీనం చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక జీపీవో, గ్రామ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు పాలిన్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని.కొనుగోలు కేంద్రాల వద్ద లారీ ల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వహించే చర్యలు తప్పవని. చిగురు మామిడి మండలంలో వేసవి కాలంలో సరఫరాలో సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దొంతులపల్లి లో ఉన్న సమస్య పరిష్కారం. డ్రింకింగ్ వాటర్ సమస్యల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పాత బావులు పూడికతీత చేసి ఉపయోగించుకోవాలని సూచించారు. సుందరగిరి లో ఇప్పటికే వేసిన బోరు కి మోటార్ కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం పై విద్యుత్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి వనరులు ఉన్న బావుల పైప్లైన్ ద్వారా నీరు సరఫరా చేయవలసి ఉంది. కొత్తపల్లి – హుస్నాబాద్ మధ్య నాలుగు లేన్ రోడ్డులో పైప్ లైన్ ఎందుకు షిఫ్ట్ చేయలేదని అధికారులు ప్రశ్నించారు.రాజీవ్ రహదారి కొత్తపల్లి నుండి హుస్నాబాద్ మధ్య జరుగుతున్న నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం వేగవంతం ,వర్షాకాలం వస్తుంటే పనులకు ఆటంకాలు కలుగుతాయని చెప్పారు.
బడి బాట ద్వారా ఇంటింటికి తిరిగి పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులను స్వాధీనం చేసుకుంది. చిగురు మామిడి మండలంలో అన్ని పాఠశాలలకు వైద్యశాలలతో పాటు, మౌలిక సదుపాయాల బెంచ్ లు,వాష్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మండలంలో ఒక్కో విద్యార్థికి ఉపాధ్యాయునికి నిష్పత్తి తక్కువగా ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. చాలా గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలలకు లేకుండా ప్రతిజ్ఞ ఈసారి ప్రీ ప్రైమరీ నుండి విద్యార్థులపై ఫోకస్ పంపాలి. స్వయంగా బడి బాట కార్యక్రమంలో తను పాల్గొంటానని మంత్రి పొన్నం ప్రభాకర్. మండలంలో ఉన్న 31 పాఠశాలకు 1225 మంది విద్యార్థులు ఉన్నారని వాటి సంఖ్య పెంచాలని సూచించారు.చిగురు వన మహోత్సవం ద్వారా 80 వేల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని వారి సహకారంతో మొక్కలు నాటాలని అన్నారు. మండలంలో కొత్త రోడ్లు ఏర్పాటు ఇరువైపుల మొక్కలు నాటాలని.
మండలంలో 341 ఇందిరమ్మ ఇళ్లు ప్రస్తుతం 42 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు అయి పని ప్రారంభం కానీ 9 ఇళ్లు నోటీసులు ఇచ్చి రద్దు స్వాధీనం. 193 ఇల్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని జూన్ 2 లోపు భారీగా ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం జరగాలని హౌసింగ్ అధికారులను తీసుకున్నారు. చిగురు మామిడి మండలంలో 280 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు జరుగుతుందని రైతులకు అవగాహన కల్పించేందుకు హార్టికల్చర్ రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రోడ్డెక్కారు. విద్యుత్ లూస్ కేబుల్స్ లేకుండా జాగ్రత్తలు అధికారులను నియమించారు. మండలంలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఏర్పాటు చేశారు. అంగన్వాడి కొత్త భవనాల నిర్మాణం పూర్తైనవి ప్రజా ప్రగతి పాలన ప్రణాళికలో ప్రారంభించాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి,మదక ద్రవ్యాలు నిరోధించడానికి పోలీసులు మండలాన్ని ఆదర్శంగా నిలపాలి. గ్రామాల్లో ఏ సమస్య ఉందో తెలపడానికి ముందు గ్రామాల ప్రజలతో కమిటీ వేసి వారి దగ్గర వచ్చిన సమస్యలు ఇక్కడ చర్చకు వచ్చాయి. అధికారులు ప్రతి సమస్యపై పరిశీలన చేసుకోవాలి. మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి.
సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డిపిఓ జగదీశ్వర్, డిఆర్డిఓ శ్రీధర్, జెడ్పీ సిఐఓ శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.