Home సినిమా ఒక్క గంట నిద్ర మిస్ అయితే.. కోలుకోవడానికి నాలుగు రోజులు.. ఇక 2062 వ‌ర‌కు ఆగాల్సిందే! – Andhra Waves

ఒక్క గంట నిద్ర మిస్ అయితే.. కోలుకోవడానికి నాలుగు రోజులు.. ఇక 2062 వ‌ర‌కు ఆగాల్సిందే! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


దక్షిణాది చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి త్రిష కృష్ణన్. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే త్రిష, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. తన నిద్ర గురించి ఆమె చేసిన వింత లెక్కలు చదివిన వారు “అమ్మో.. త్రిషకు ఇంత పని ఒత్తిడి ఉందా?” అని ఆశ్చర్యపోతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు తమ షూటింగ్ ఫొటోలు లేదా గ్లామర్స్ ఫోటోషూట్‌లు జరుపుకుంటారు. కానీ త్రిష తన వ్యక్తిగత జీవితంలో అలసటను చాలా సరదాగా పంచుకున్నారు. “ఒక్క గంట నిద్రను కోల్పోతే, దాని నుండి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి నాకు కనీసం నాలుగు రోజులు పడుతుంది. ఈ లెక్కన చూసుకుంటే, నేను మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందే” అంటూ ఆమె ఒక చమత్కారమైన కొటేషన్‌ను షేర్ చేశారు.

ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే ప్రస్తుతం త్రిష ఎంతటి బిజీ షెడ్యూల్స్ అనుభవిస్తుందో అర్థమవుతోంది. రాత్రింబవళ్లు షూటింగులు, నగరాలకు ప్రయాణాలు చేస్తూ విశ్రాంతి లేని జీవితం గడుపుతున్నట్లు ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది.

త్రిష ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభరసం రిలీజ్ కావాల్సి ఉంది. సూర్యతో కలిసి ‘కరుప్పు’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అటు తెలుగు, ఇటు తమిళం.. రెండు భాషల్లోనూ టాప్ హీరోల సరసన నటిస్తున్నారు. ఈ పని ఒత్తిడి వల్లే ఆమెకు కంటి నిండా నిద్ర కరువైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా రంగంలో గ్లామర్ వెనుక ఉంటే కష్టం అంతా ఇంతా కాదు. తెరపై మెరిసిపోయే నటినటులు తమ ఆరోగ్యాన్ని, నిద్రను పణంగా పెట్టి కష్టపడుతుంటారు. త్రిష కూడా అదే సమయంలో తన స్టైల్ చమత్కారంగా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె మళ్ళీ తన సాధారణ నిద్రను 2062 వరకు ఆగాల్సిన అవసరం రాకూడదని, త్వరలోనే ఆమెకు మంచి విశ్రాంతి దొరకాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన మనసులోని మాటను ఫ్యాన్స్‌తో పంచుకోవడం త్రిష ప్రత్యేకత అని చెప్పవచ్చు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird