Home Latest News డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్ : సీఎం చంద్రబాబు | ప్రభుత్వ సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ | టీడీపీ | ఆంధ్రప్రదేశ్ | సమీక్ష | RTGS – Andhra Waves

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్ : సీఎం చంద్రబాబు | ప్రభుత్వ సేవలు కూడా ఆన్‌లైన్‌లోనే | సీఎం చంద్రబాబు | నారాలోకేష్ | టీడీపీ | ఆంధ్రప్రదేశ్ | సమీక్ష | RTGS – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రభుత్వ శాఖలు అందజేసే అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను నియమించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధికి అన్ని సేవలు తీసుకువస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖలతో కూడిన క్యాంపు బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష జరిగింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందించామని తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

వాట్సప్ గవర్నెన్స్ వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకు 24 లక్షల మందికి పైగా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఎలా పొందాలో అవగాహన కల్పించామని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఏర్నాటు చేస్తున్న డ్రోన్ సిటీ ఫేజ్ 1 అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని… ఇప్పటికే ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 8 కంపెనీలకు భూముల కేటాయింపు పూర్తయిందని, మే రెండో వారంలో అన్ని పనులకు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రోన్ సిటీ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యిందని అధికారులు ఇచ్చిన వివరణ పై స్పందించిన సీఎం… ఈ ఏడాది నాటికి మొదటి దశ పనులు జూలైలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సీసీ కెమెరాలతో నేర నియంత్రణ చర్యలు

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో సీసీ టీవీ కెమేరాల ఏర్పాటు, వాటి వినియోగం, పర్యవేక్షణ జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడంతో పాటు… మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, వాహనాల దొంగతనాల వంటి కేసులు వేగంగా కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమేరాలు లేని ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డేటాను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.

సీసీ కెమేరాలతో పాటు శాటిలైట్ డేటాను వినియోగించు కునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. శాటిలైట్‌ని ఆర్టీజీఎస్‌కు అనుసంధానించి వేగంగా చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఇటీవల తిరుమల-తిరుపతి సమీపంలోని శేషాచల ప్రాంతంలో మంటలు వ్యాపించిన ఘటనపై వేగంగా స్పందించే అవకాశం ఉంది. డీజిల్, పెట్రోలు సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలతో మళ్లీ సాధారణ స్థితికి నెలకొందని… అయితే సమస్య ఉత్పన్నం కాకముందే రియల్ టైమ్‌లో స్పందించేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird