దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠకు తెరలేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఉద్దేశం, ప్రముఖ సర్వే సంస్థ ‘చాణక్య స్ట్రాటజీస్’ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ అంచనాలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల నాడిని ఈ సంస్థ అంచనా వేయగా, కొన్ని చోట్ల అధికార పక్షాలకే మొగ్గు చూపుతుండగా, అనేక చోట్ల కీలక మార్పులు చోటుచేసుకోవచ్చని సర్వేలో తేలింది.
పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చినట్లు సర్వే చెబుతోంది. తాజా అంచనాల ప్రకారం, 150 నుంచి 160 స్థానాలతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మమతా బెనర్జీ రద్దును తృణమూల్ 130-140 స్థానాలకు పరిమితం చేయవచ్చు. ఓట్ల శాతంలోనూ కమలనాథులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తురని చాణక్య స్ట్రాటజీస్ అంచన వేసింది.
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మాత్రం డీఎంకే వ్యతిరేక కూటమి హవా కొనసాగుతోంది. 145-160 స్థానాలతో స్టాలిన్ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. నటుడు విజయ్ కొత్త పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ కూడా ఆశించిన ఓట్లు సాధించి, కొన్ని సీట్లను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
కేరళలో ఈసారి అధికార మార్పు తప్పదని సర్వే హెచ్చరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ7ని యూడీఎఫ్ కూటమి2-80 సీట్లతో విజయం సాధించనుండగా, ప్రస్తుత అధికార ఎల్డీఎఫ్ వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. అస్సాంలో మాత్రం సీఎం హిమంత బిశ్వ శర్మ చరిష్మా పనిచేయడంతో, బీజేపీ ప్రత్యామ్నాయం ఎన్డీయే కూటమి 88-98 సీట్లతో ఘనవిజయం దిశగా సాగుతోంది.
పుదుచ్చేరిలో సైతం ఎన్డీయే కూటమి తన అధికారాన్ని కొనసాగిస్తూ, మ్యాజిక్ ఫిగర్ 16 కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుని అధికార పీఠాన్ని దక్కించుకోనుంది. విపక్ష గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, విజయం సాధించడంలో విఫలమవుతుందని సర్వే.
ఈ సర్వే ఫలితాలు రాజకీయ విశ్లేషకుల్లో వేడిని పెంచాయి. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, అసలైన ప్రజా తీర్పు మే 4న వెలువడిన ఫలితాల్లోనే బయటపడుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టారో మరో కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్.
బీజేపీ 150-160, TMC 130-140, INC-2-4, ఇతర పార్టీలు 4-6
తమిళనాట (234) డీఎంకే కూటమి 145-160, AIADMK 50-65, TVK 13-18, ఇతర పార్టీలు 5-8 సీట్లు
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్.
తమిళనాడు (234): డీఎంకే 125-146,ఏడీఏఎంకే 65-80
టీవీకే 18-24, ఇతరులు 2-6
కేరళం (140): ఎల్‌డీఏఫ్ 55-65, యూడీఎఫ్ 75-85, ఎన్‌డీఏ 0-3
అసోం (126): బీజేపీ 68-72, కాంగ్రెస్ 22-26,ఏజీపీ 7-10, బీపీఎఫ్ 8-9
తమిళనాడు (మొత్తం: 234)
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
డీఎంకే: 125 – 145
ఏడీఎంకే: 65 – 80
టీవీకే (విజయ్): 18 – 24
ఇతరులు : 2 – 6
కేరళ (మొత్తం: 140)
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
యూడీఎఫ్: 75 – 85
ఎల్డీఎఫ్: 55 – 65
బీజేపీ: 0 – 3
ఇతరులు : 0
అసోం (మొత్తం: 126)
సంస్థ: యాక్సిస్ మై ఇండియా
బీజేపీ: 88 – 101
కాంగ్రెస్: 15 – 36
ఏఐయూడీఎఫ్: 0
ఇతరులు: 0 – 3
పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
టీసీ: 177 – 187
బీజేపీ: 95 – 110
కాంగ్రెస్: 1 – 3
వాపక్షాలు: 0 – 1
పుదుచ్చేరి (మొత్తం: 30)
ఏజెన్సీ: పీపుల్స్ పల్స్
ఎన్ఆర్సీ: 16 – 19
కాంగ్రెస్: 10 – 12
ఇతరులు: 1 – 2
