సైబరాబాద్ కమిషనరేట్‌లో నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి పై స్వాతి అనే యువతి ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయికిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తాజా సహజీవనం చేపి మోసం చేశాడనీ, దీంతో తాను గత ఏడాది అక్టోబర్‌లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్‌పై ఫిర్యాదు చేసినట్లు స్వాతి. అయితే నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి ఇన్ని నెలలు గడిచినా కూడా సాయి కిరణ్ పై సరైన విచారణ జరగలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను సాయి కిరణ్ వాళ్ల ఊరు విజయనగరం కు వెళితే… అక్కడ తండ్రి రాజకీయ కార్యకర్త కావడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేశారు.
ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం.. కేసు పెట్టినా ఏం జరగదు.. చంపేస్తామంటూ బెదరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయబోతే.. హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయబోతున్నారని స్వాతి.. గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది. కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
