చమురు సరఫరా ఆగకూడదు, దేశ ఆర్థిక వ్యవస్థ వెనకడుగు వేయకూడదు అన్న లక్ష్యంతో భారత్ గల్ఫ్ తో భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రియాద్ పర్యటన, కేంద్ర మంత్రి జైశంకర్ యూఏఈ చర్చలు, మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ సందర్శన ఇవన్నీ ఎనర్జీ సెక్యూరిటీ లక్ష్యంగా సాగినవే.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. తన చమురు, గ్యాస్ సరఫరాను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే.. షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా, నిర్బంధం లేకుండా కొనసాగాలని కోరుతోంది. భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ లో అరవై దాదాపు గల్ఫ్ ప్రాంతంపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఇండియా గల్ఫ్ దేశాలతో దౌత్యం నెరపుతోంది.
ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల అంటే ఈ నెల 19న సౌదీ రాజధాని రియాద్‌లో చేరారు. అక్కడ ఆయన ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ జీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, అలాగే ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు, ముసాయిద్ అల్–ఐబాన్ తో వరుస భేటీలు జరిపారు. , ఈ చర్చల్లో.. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ప్రాంతీయపరిస్థితులు, ఇంధన సహకారం, సముద్ర రవాణా భద్రత వంటి వాటి గురించిన సమాచారం.
ఇండియాకు టాప్ మూడు చమురు సరఫరా దేశాలలో రష్యా, ఇరాక్ తో పాటు సౌదీ కూడా ఉంది. అంతే కాకుండా సౌదీలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్స్ తయారయ్యారు. ఇటీవల సౌదీ, పాక్ రక్షణ ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతా సమీకరణలు, ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో.. రియాద్‌తో నిరంతర, నేరుగా, ఉన్నత స్థాయి సంభాషణ భారత్‌కు అత్యవసరం. చమురు ధరలు, సరఫరా, షిప్పింగ్ భద్రత వీటిపై సౌదీ ఉన్నత స్థాయి వర్గాలతో అజిత్ దోవల్ జరిపిన చర్చలు సానుకూలంగా సాగినట్లు భారత దౌత్య వర్గాల సమాచారం.
అజిత్ దోవల్ సౌదీ పర్యటనకు ముందు. ఈ రెండు పర్యటనలకు ముందు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈలో ఉన్నారు. జైశంకర్ యూఏపీ పర్యటన కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే.. ఎందుకంటే.. యూఏఈ ఇండియాకు ముఖ్య వాణిజ్య భాగస్వామి. పెట్టుబడులు, మౌలిక వసతులు, డిజిటల్, ఫైనాన్షిల్ రంగాలలో ఇరు దేశాల మధ్య కీలక భాగస్వామ్యం ఉంది.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన కూడా ఇందులో భాగంగానే జరిగింది. ఎందుకంటే ఖతార్.. ఇండియాకు ఎల్ఎన్జీ, ఎల్పీజీ ప్రధాన సరఫరాదారు. దీర్ఘకాల గ్యాస్ ఒప్పందాలు, ధర స్థిరీకరణ, షిప్పింగ్ భద్రత ఇవన్నీ నేరుగా భారత విద్యుత్, పరిశ్రమ, గృహ వినియోగంపై ప్రభావం చూపే అంశాలు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో సౌదీ, యూఏఈ, ఖతార్ దిశగా జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు భారత్ భారత్ వ్యూహాత్మక దౌత్య అడుగులుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఇండియా ఇప్పుడు విస్పష్టంగా ఇంధన అవసరాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ సరఫరాదారులతో దీర్ఘకాలిక, స్థిరమైన ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా కదులుతోంది.
పశ్చిమ ఆసియాలో ఎవరి రాజకీయ మార్గం ఎలా ఉన్నా.. ఇండియా మాత్రం ఇంధన భద్రత, జాతీయ భద్రత లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దోవన్ సౌదీ నాయకత్వంతో జరిపిన చర్చలలో.. రవాణా భద్రత, నిర్బంధం వాణిజ్య నౌకల సాఫీ ప్రయాణం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లేదా నియంత్రించే దౌత్య మార్గాలు వంటి వాటి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సేకరణ, సంకలనం: సీతారాం కంఠంనేని
సూచనలు
• హిందూస్తాన్ టైమ్స్ – NSA అజిత్ దోవల్ సౌదీ అరేబియాను సందర్శించి కీలక ఇంధన సరఫరాదారులైన హిందుస్థాన్ టైమ్స్
• Zee News – NSA అజిత్ దోవల్ కీలకమైన ఇంధన సరఫరాదారులకు భారతదేశం అందించడంలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శించారు Zee News
• GNN / NewsAge – హార్ముజ్ జలసంధి మూసివేత మధ్య కీలక ఇంధన సరఫరాదారులను నిమగ్నం చేయడానికి భారతదేశం యొక్క పుష్ gnn.asia news-age.com
• రాష్ట్ర కరస్పాండెంట్లు – పశ్చిమాసియా సంక్షోభం మధ్య దోవల్ రియాద్ సందర్శన “సహాయకరమైన & వ్యూహాత్మకం” అని MEA నిబంధనలు statecorrespondents.com
