Home Latest News హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు గోపాలరావు కన్నుమూత | హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు ఎస్.గోపాలరావు కన్నుమూత | హైదరాబాద్ బుక్ ఫెయిర్ | హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ | బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డాక్టర్ కవి యాకూబ్ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | జూలూరి గౌరీ శంకర్ – Andhra Waves

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు గోపాలరావు కన్నుమూత | హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు ఎస్.గోపాలరావు కన్నుమూత | హైదరాబాద్ బుక్ ఫెయిర్ | హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ | బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డాక్టర్ కవి యాకూబ్ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | జూలూరి గౌరీ శంకర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ పుస్తక రంగానికి విశిష్ట సేవలందించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతూ కొండాపూర్ లోని తన కుమారుడి నివాసంలో ఏప్రిల్ 23న తుదిశ్వాస విడిచారు. గోపాలరావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ స్థాపకుల్లో ముఖ్య పాత్ర పోషించారు. తొలి పుస్తక ప్రదర్శన నిర్వహణలో సమన్వ యకర్తగా వ్యవహరించి, నగరంలో పుస్తక సంస్కృతిని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే తన సైంటిఫిక్ సర్వీసెస్ సంస్థ ద్వారా పుస్తక రంగానికి అనేక సేవలు అందించారు.

పుస్తక ప్రదర్శనల నిర్వహణలో ఆయన చేసిన కృషి పుస్తకాభిమానులు, ప్రచురణకర్తలు ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా నిలిచారు. ఆయన భౌతిక దేహాన్ని ఏప్రిల్ 26 ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని స్వగృహంలో మిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. గోపాలరావు మరణంపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. కవి యాకూబ్, కార్యదర్శి ఆర్. వాసు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి గురించి, పుస్తక రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పుస్తక సంస్కృతిని ప్రజల్లో విస్తరించేందుకు జీవితాన్ని అంకితం చేసిన గోపాలరావు పుస్తక ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird