ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్ట్ (ఇటీవల ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన ఒక అంతర్గత శిక్షణ పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అది కాస్త పెను వివాదానికి దారితీసింది. ముఖ్యంగా వారి డ్రెస్ కోడ్‌లలో కొన్ని మతపరమైన చిహ్నాలను అనుమతించడం, నిషేధించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టర్బన్‌లను ధరించవచ్చనీ, అదే సమయంలో నుదుటిపై బొట్టు, తిలకం ధరించడం లేదా చేతికి రక్షాబంధనం (చేతి తాడు) వంటి దారాలను కట్టుకోవడం ఆ పత్రంలో రాసి ఉండటం కలకలం రేపింది.
ఈ నిబంధనలు బయటకు రావడంతో.. ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సీఐఓ పేయూష్ బన్సల్ రంగంలోకి దిగారు.ఆయన తన ఎక్స్‌కౌంట్ ద్వారా ప్రచారంలో ఉన్న డాక్యుమెంట్ సంస్థ యొక్క ప్రస్తుత విధానాలను ప్రతిబింబించేలా చేశారు. అది పాత ఇంటర్నల్ డాక్యుమెంట్ అని ఆయన అందులో ఉన్న తప్పులను ఫిబ్రవరిలోనే గుర్తించి తొలగించామని వివరణ ఇచ్చారు. లెన్స్ కార్ట్ భారతీయుల కోసం నిర్మించబడిన సంస్థ అని, ఇక్కడ మతపరమైన లేదా వ్యక్తీకరణలపై, ముఖ్యంగా బొట్టు తిలకంపై ఎటువంటి ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు.
అయితే, ఆ వ్యక్తి డాక్యుమెంట్‌పై 2026 ఫిబ్రవరి తేదీ ఉండటంతో, సీఈఓ వివరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ సంస్థలు కేవలం ప్రకటనల కోసమే డైవర్సిటీ అనే పదాన్ని వాడతాయా లేక క్షేత్రస్థాయిలో ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాయా అనే చర్చ ఇప్పుడు న్యాయ, సామాజిక వర్గాల్లో మొదలైంది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, కంపెనీల బ్రాండ్ రూల్స్‌కు మధ్య ఉండాల్సిన పరిస్థితిపై ఈ ఘటన మరోసారి చర్చను రేకెత్తించింది. భవిష్యత్తులో ఇటువంటి సున్నితమైన అంశాలలో కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వివక్షకు తావు లేకుండా అన్ని సంప్రదాయాలను సమానంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
– సీతారాం కంఠంనేని
