Home Latest News నగర చాయ్‌కు కల్తీ నీడ…భారీ రైడ్స్‌లో నకిలీ టీ గ్యాంగ్ అరెస్ట్ | నకిలీ టీ ముఠా అరెస్ట్ | హైదరాబాద్ | భారీ ఆపరేషన్ | కల్తీ ఆహార వ్యాపారం | సింథటిక్ డై | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | మంత్రి జూపల్లి కృష్ణారావు | సీపీ సజ్జనార్ – Andhra Waves

నగర చాయ్‌కు కల్తీ నీడ…భారీ రైడ్స్‌లో నకిలీ టీ గ్యాంగ్ అరెస్ట్ | నకిలీ టీ ముఠా అరెస్ట్ | హైదరాబాద్ | భారీ ఆపరేషన్ | కల్తీ ఆహార వ్యాపారం | సింథటిక్ డై | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | మంత్రి జూపల్లి కృష్ణారావు | సీపీ సజ్జనార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ రోజే కదలదు. అలాంటి నగరంలోనే ఇప్పుడు “నకిలీ చాయ్ పత్తా” కలకలం రేపింది. ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో నకిలీ చాయ్ తయారీ ముఠా బండారం బయటపడింది. ఒకేసారి చెప్పే ప్రత్యేక బృందం 15 చోట్ల దాడులు జరిపిన హెచ్-పాస్, ఈ అక్రమ వ్యాపారం 10 మంది సభ్యులను అరెస్టు చేసి… వారి వద్ద నుంచి 4,000 కిలోల నకిలీ చాయ్‌పత్త, 1,500 కిలోల ముగిసిన గడువు టీ పొడి 100 కిలోల నకిలీ నల్ల బెల్లం స్వాధీనం నగరంలో కల్తీ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోంది.

10 కేటుగాళ్లు కలిసి తక్కువ నాణ్యత గల చాయ్ పత్తాలో సింథటిక్ రంగులు కలిపి, ఆకర్షణీయమైన రంగుతో “బ్రాండ్ టీ”లా మార్చి ప్రజలు విశ్వసించే ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించి మార్కెట్లో దర్జాగా విక్రయిస్తున్నారు..
ఈ సింథటిక్ రంగులు స్వీట్లలో మాత్రమే పరిమితంగా వాడాలి. కానీ చాయ్ పత్తాలో ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి, అలర్జీలు,జీర్ణ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నకిలీ టీ పౌడర్ ను ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తెచ్చి, నగరంలో ప్రాసెస్ చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి 10 మంది కేటుగాళ్లు అదుపులోకి తీసుకున్నారు.

కల్తీ ఆహార వ్యాపారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కల్తీ తయారీ లేదా విక్రయం చేసిన వ్యాపారులపై ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు “చాయ్ కొనేటప్పుడు బ్రాండ్ నిజస్వరూపం, ప్యాకింగ్, వాసన, నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలి” అని అధికారులు చెప్పారు…నగరానికి ఇష్టమైన చాయ్ కప్పులో ఇప్పుడు కల్తీ నీడ పడిన నేపథ్యం… వస్తువుల సంరక్షణ రక్షణ అని పోలీసులు చెబుతున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird