Home Latest News పాతబస్తీలో జంట హత్యలు…నిందితుడు పరారీ | పాతబస్తీలో జంట హత్యలు | మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ | ఆదిల్ ఖాన్ | అఖ్వీల్ ఖాన్ | అజ్మేరీ బేగం | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

పాతబస్తీలో జంట హత్యలు…నిందితుడు పరారీ | పాతబస్తీలో జంట హత్యలు | మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ | ఆదిల్ ఖాన్ | అఖ్వీల్ ఖాన్ | అజ్మేరీ బేగం | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ | డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూరు ఖాన్ బజార్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, అదిల్ ఖాన్ అనే వ్యక్తి తన సోదరుడు అఖ్వీల్ ఖాన్‌తో పాటు అజ్మీరీ బేగాన్ని ఇంట్లోనే దారుణంగా హత్య చేసి పరారైనట్లు సమాచారం. ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్ చౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు.

హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స. మృతులకు నలుగురు సంతానం ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మృతుడు డ్రైవర్‌గా, నిందితుడు వెల్డర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. నిందితుడికి సంతానం లేకపోవడం వల్ల మృతులు అతన్ని ఆటపట్టించేవారని, అదే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird