Home Latest News చంచల్‌గూడ జైలు సమీపంలోని ఖైదీ పరారీ | చంచల్‌గూడ జైలు దగ్గర ఖైదీ పరారీ | హైదరాబాద్ పోలీసులు | బోయినపల్లి పోలీస్ స్టేషన్ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ – Andhra Waves

చంచల్‌గూడ జైలు సమీపంలోని ఖైదీ పరారీ | చంచల్‌గూడ జైలు దగ్గర ఖైదీ పరారీ | హైదరాబాద్ పోలీసులు | బోయినపల్లి పోలీస్ స్టేషన్ | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ పోలీసులు | సీపీ సజ్జనార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. చంచల్‌గూడ జైలు నుంచి పీటీ వారెంట్‌పై ముగ్గురు ఖైదీలను పోలీసులు తరలిస్తుండగా, వారిలో ఒకరు పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ఖైదీలను కోర్టు ప్రక్రియ నిమిత్తం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు. ఈ చంచల్‌గూడ ప్రధాన రహదారిపై వాహనం నిలిపిన సమయంలో, ఒక ఖైదీ పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చంచల్‌గూడ, మలక్‌పేట్, కోటి, ముసారంబాగ్‌లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పరారైన ఖైదీపై ఇప్పటికే పలు కేసులు సమాచారం. ఘటనపై ఆరా తీస్తుండగా, ఖైదీ ఎలా తప్పించుకున్నాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird