Home సినిమా కన్నీటి పర్యంతమైన రాధిక.. దర్శక శిఖరం భారతీరాజా పరిస్థితి ఇదే – Andhra Waves

కన్నీటి పర్యంతమైన రాధిక.. దర్శక శిఖరం భారతీరాజా పరిస్థితి ఇదే – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


-దర్శకుడిగా ఎంతో మందికి గురువు
-ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితం
-రాధిక శరత్ కుమార్ భావోద్వేగ పోస్ట్

సెల్యులాయిడ్ కి సరికొత్త కథ, కథనం, టేకింగ్ పరిచయం చేసిన దర్శక శిఖరంలో ‘భారతిరాజా'(భారతిరాజా)ఒకరు. ముఖ్యంగా ప్రేమకథ చిత్రాలకి ఆయన పోసిన ప్రాణ బిక్ష ఎవరు పోసి ఉండరేమో. ఇలా ఆయన దర్శక ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన ప్రేమ కావ్యాలని అందించిన భారతీరాజా గత కొంత కాలం నుంచి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. ఈ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్(రాధిక శరత్ కుమార్)సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాల్ని తాకుతుంది. మరి ఆ పోస్ట్ ఏంటో చూద్దాం.

“నా దర్శకుడు, నా గురువు గారిని ఈ స్థితిలో చూడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ క్షణం నాకు ఎంతో విలువైనది. ‘తాయ్ కిళవి’ మూవీలో నా నటన చూసి, ఖచ్చితంగా నాకు జాతీయ అవార్డు వస్తుందని దీవించారు. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట నాకు ప్రపంచంలో ఏ అవార్డు కన్నా గొప్పది”. సినిమాపై ఉన్న ప్రేమే ఆయన్ను ఈ స్థితిలోనూ ముందుకు నడిపిస్తోంది అని రాధిక రాసుకొచ్చింది. ఇక వీడియో కూడా షేర్ చేయడంతో భారతీరాజాని చూసిన అభిమానులు ఎంతగానో బాధపడతారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: పెద్ది: పెద్ది స్పెషల్ సాంగ్‌లో బాలయ్య హీరోయిన్.. రంగంలోకి ఫ్యాన్స్

1978లో ‘కిళక్కే పోగుమ్ రైల్’ చిత్రంతో రాధికని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది భారతీరాజానే. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా పోయింది. రాధిక నే కాదు ఎంతో మంది నటి నటీమణులకి నటనలో మెళుకువలు నేర్పి నట గురువు కూడా అయ్యారు. గత మార్చి ఏడాదిలో తన కుమారుడు,నటుడైన మనోజ్ భారతీరాజా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఆ బాధ ఆయన్ని మానసికంగా కుంగదీసింది. పైగా వయసు కూడా పెరగడంతో పలు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. తెలుగులో చిరంజీవితో ఆరాధనతో పాటు తెలుగులో నటించిన అతి తక్కువ ప్రేమ కథా చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయే ‘సీతాకోక చిలుక’ కూడా భారతిరాజాదే.


You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird