మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఒక వైపు శాంతి ప్రణాళిక, చర్చలు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాళ్ల బేరానికి వస్తూనే.. ఇరాన్ కు తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరాన్ తన దాడులకు పదును పెట్టింది. కువైట్‌లోని అత్యంత కీలకమైన మీనా అల్-అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. శుక్రవారం ( ఏప్రిల్ 3) జరిగిన ఈ అనూహ్య దాడితో ఒక్కసారిగా గల్ఫ్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు నేరుగా రిఫైనరీని తాకడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించింది. దాడి వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడిం చింది.
అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన మీనా అల్-అహ్మదిపై ఇరాన్ దాడి . కువైట్ ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ దాడుల నేపథ్యంలో కువైట్‌లోని చమురు బావుల నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుద్ధి సామర్థ్యం తగ్గిపోతే బావుల నుంచి ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. భారత్ సహా అనేక దేశాలు ఇక్కడి నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న భారత్, ముందస్తు జాగ్రత్తగా కువైట్ నుంచి చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇక ఇరాన్ దాడికి అమెరికా సైతం దీటుగా స్పందించింది. శాంతి వచనాలను పక్కన పెట్టి ఇరాన్ పై దుందుడుకు దాడులకు దిగారు. అందులో భాగంగానే… తాజాగా అత్యంత శక్తివంతమైన ఎఫ్-15 యుద్ధ విమానంతో ఇరాన్ డ్రోన్ ను గగనతలంలోనే కూల్చివేసింది. సిరియా పరిసర ప్రాంతాల అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ డ్రోన్‌ను గుర్తించిన అమెరికా వైమానిక దళం, అప్రమత్తమై దానిని ధ్వంసం చేసింది.
కువైట్‌లోని కీలకమైన చమురు రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిరియాలోని అల్-తన్ఫ్ బేస్ సమీపంలో డ్రోన్ ప్రవేశాన్ని పసిగట్టిన అమెరికా రాడార్ వ్యవస్థలు అప్రమత్తం చేయడంతో.. F-15 యుద్ధ విమానం గగనతలంలోనే ఆ డ్రోన్‌ను వెంబడించి నేలకూల్చింది.
.webp)