నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ సమీపంలో నివాసముంటూ న్న న్యాయవాది కాజా మొహినుద్దీన్ దారుణహత్యకు పాల్పడ్డారు. శనివానం (మే 23) ఉదయం కోర్టుకు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు కారులో వచ్చి అత్యంత వేగంగా న్యాయవాది కాజామొయినుద్దీన్ను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాజా మొహినుద్దీన్ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి వచ్చారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి డిసిపి చేరుకున్నారు.
ఈ భూ వివాదాల కోణంలో హత్య ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ భూముల వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా పేర్కొన్నారు. మలక్‌పేట ప్రాంతంలోని భూ వివాదాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని గుర్తించింది.వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించిన అంశాల్లో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో అడ్వకేట్ కాజా మొయినుద్దీన్‌కు గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గతంలో కూడా నిందితులు ఇద్దరూ న్యాయవాదికి హాని తలపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యా నమోదైనట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ కాలేజీల యజమానుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి ఏర్పాటు.
.webp)