ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్)కి ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. బడా,చోట హీరోలతో సినిమాలు నిర్మించడంతో పాటు పంపిణి రంగంలోనూ తమ సత్తా చాటుతూ వస్తుంది. ఈ కోవలోనే యాక్షన్ కింగ్ అర్జున్ నుంచి వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్'(బ్లాస్ట్ జోన్). తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార కైవసం చేసుకుంది. ఈ సంస్థ అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులలోనూ బ్లాస్ట్ జోన్ పై ఆసక్తి పెరిగింది.
సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో ఇండియన్ సినిమా తన సంగీతంతో ఊపేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించడం విశేషం. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ప్రమోషన్స్ లో మేకర్స్ చెబుతున్నారు.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌తో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్, గుండెను హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, అందులోని సభ్యులు మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణులు కావడం, ఒకానొక ప్రమాదకరమైన పరిస్థితిలో వారి జీవితాలు ఎలాంటి ప్రమాదంలో పడ్డాయి అనే కథాంశంతో అభిరామి, ప్రీతి ముకుందన్ కీల్స్‌లో కనిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కర: కర ఓటిటి డేట్ ఇదే.. ధనుష్ ఫ్యాన్స్ చెయ్యాల్సింది ఇదే
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గతంలో ‘లియో’, ‘దేవర’, ‘భ్రమయుగం’ వంటి విభిన్న చిత్రాలను తెలుగులో విడుదల చేసి ఘన విజయాలని అందుకుంది. ఇప్పుడు అదే నమ్మకంతో ‘బ్లాస్ట్ జోన్’ హక్కులను సొంతం చేసుకోవడం. మే 28న వరల్డ్ వైడ్ గా విడుదల. సితార వంటి అగ్ర సంస్థ చేతుల్లోకి బ్లాస్ట్ జోన్ వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో భారీ స్థాయిలో స్క్రీన్లు దక్కే అవకాశం ఉంది.

