Home Latest News ఏపీలో విద్యాశాఖ కీలక నిర్ణయం | AP విద్యా శాఖ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| ఉదయం పాఠశాలలు| హాఫ్ డే స్కూల్| తెలంగాణ| పెరుగుతున్న ఉష్ణోగ్రత – Andhra Waves

ఏపీలో విద్యాశాఖ కీలక నిర్ణయం | AP విద్యా శాఖ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| ఉదయం పాఠశాలలు| హాఫ్ డే స్కూల్| తెలంగాణ| పెరుగుతున్న ఉష్ణోగ్రత – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఎండలు, అధిక స్థాయి ప్రభావం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉక్కబోతలు, ఎండవేడిమి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి ఏడాది ఈసారి కూడా మార్నింగ్ స్కూల్స్ అమలు చేయనున్నారు.

ఇక తెలంగాణలోనూ మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird