హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును నాంపల్లి కోర్టు మరోసారి తిప్పి పంపింది.. ఇప్పటికే నాంపల్లి కోర్టు రెండు సార్లు చార్జిషీట్‌ను తిరస్కరించింది. ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన పత్రాల్లో కూడా సాంకేతికత మరియు ఆధారపూరితమైన లోపాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఈ ఘటనకు సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 23 మందిపై పోలీసులు అభియోగాలు మోపుతూ చార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు.
తొక్కిసలా టకు దారి తీసిన పరిస్థి తులు థియేటర్‌లో జరిగిన నిర్లక్ష్యం భద్రతా ఏర్పాట్లు లోపాలు వంటి ప్రధాన అంశాలను ప్రస్తావించినప్పుడు బలపరచడానికి అవసరమైన సాక్ష్యాధారాలను ఆ విధంగా జత చేయలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూ చార్జిషీట్‌ను రిటర్న్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీటీవీ ఫుటేజ్‌లో నిల్వ చేసిన హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు వంటి కీలక మెరియల్‌ను చార్జిషీట్‌తో పాటు సమర్పించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేసులో అంశాలకు అనుగుణంగా సాక్షాలు లేకపోవడం వల్ల విచారణ ప్రక్రియ ముందుకు సాగడం కష్టమని నాంపల్లి కోర్టు… సాంకేతిక లోపాలు, పత్రాల అసంపూర్ణత వస్తువులను సరిచేసి మళ్లీ కోర్టుకు చార్జి షీట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు లోపాలను సవరించిన పోలీసులు తాజాగా మరోసారి ఛార్జ్ షీటును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఆధారాలను జతపరచి సాంకేతిక లోపాలు ఏవీ లేకుండా సమర్పించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ ప్రారంభం. సంధ్య థియేటర్ ఘటనలో బాధితులకు న్యాయం జరిగే దిశగా ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందన్న దానిపై ఆసక్తి చూపుతోంది. చార్జిషీట్ పై కోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం ఈ కేసులో కీలకంగా మారనుంది.. ఇదిలా ఉండగా ఈ కేసులో ఓ తల్లి, పిల్లలకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి రేవతిగా… కుమారుడు ఇప్పటివరకు పూర్తిగా కోలుకోలేదు.
