నిర్మల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 42 వార్డులకు గాను 24 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు.పార్టీ అగ్రనేతలు ప్రకటించిన విధంగా ముందుగా అప్పాల కావ్య మున్సిపల్ చైర్ పర్సన్ కానున్నారు .ఇంతకు ముందు ఆమె భర్త అప్పల గణేష్ చక్రవర్తి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు.
మొత్తానికి మునిసిపల్ చైర్మన్ అవకాశం అప్పాల కుటుంబానికి నాలుగవసారి దక్కింది. అదే కుటుంబానికి చెందిన తరం నుండి కావ్య ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి తరంలో అప్పాల నరసయ్య 1981 లో, రెండవ తరంలో ఆయన కోడలు అప్పాల అనురాధ 2006 లో, మూడో తరంలో నరసయ్య మనవడు అప్పాల గణేష్ చక్రవర్తి 2014 లో మునిసిపల్ ఛైర్మన్ పదవిని పొందారు. ప్రస్తుతం గణేష్ చక్రవర్తి భార్య అప్పాల కావ్య మునిసిపల్ చైర్ పర్సన్ కానున్నారు.
