ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత రోజులుగా టిక్కెట్లు దొరకక చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇబ్బందులు పడుతుండగా.. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు. ముఖ్యంగా కాంప్లిమెంటరీ టికెట్లను పక్కదారి పట్టించి భారీ ధరలకు విక్రయిస్తూ లక్షలు దండి సంపాదిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్టేడియం పరిసర ప్రాంతాల అభిమా నుల బలహీనతను క్యాష్ చేసుకుంటూ బ్లాక్ టికెట్ల వ్యాపారం జోరుగా కొనసా గుతున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అట్టి ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈరోజు ఉప్పల్ స్టేడియం దగ్గర అధిక ధరలకు ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలుచోట్లకు చెందిన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. టికెట్లు ఎవరి నుంచి వచ్చాయి..? ఇంకా ఈ దందాలో మరెవరు ఉన్నారు..? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
