పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ కానున్నాయి. ఈ మేరకు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు గురువారం (ఫిబ్రవరి 12) కలిశారు.
ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛానల్స్ కు అక్రెడిటేషన్ జారీ విషయంలో అన్యాయం జరిగిన పరిశీలన వారు మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి పొంగులేటి ఎవరూ ఆందోళన చెందివద్దనీ, పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టుకు అక్రెడిటేషన్ ప్రకటించాలని సూచించారు.
