తెలుగు సినీ ప్రేక్షకులకు సంచలన అనుభూతిని కలిగించే సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ మరో భారీ ప్రదర్శనకు తెరతీశారు. దశాబ్దాలుగా సినిమా ఒక పండగలా జరుపుకునే భాగ్యనగర వాసుల కోసం సరికొత్త విందు సిద్ధమవుతోంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏఎంబీ సినిమాస్, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. నగరంలో రాబోతున్న వారి సరికొత్త ప్రాజెక్ట్ “ఏఎంబీ క్లాసిక్ విక్టరీ” (AMB క్లాసిక్ విక్టరీ) లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక సరికొత్త ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ప్రపంచ స్థాయి సినిమా సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఏఎంబీ సినిమా ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలోనే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా టెక్నాలజీని తీసుకొచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకా హైదరాబాద్‌లోనే అత్యంత అద్భుతమైన హెచ్డీఆర్ బై బార్కో స్క్రీన్లను కూడా ప్రవేశపెట్టింది ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది.
ఈ అద్భుతమైన ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఇప్పుడు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం వారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి రానా లతో చేతులు కలిపారు. ఈ అగ్ర తారల కలయికతో రూపొందుతున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకే ఒక్క ఐమాక్స్ థియేటర్‌గా రికార్డు సృష్టించబోతోంది.
ఈ మల్టీప్లెక్స్ వెనుక ఒక గొప్ప చరిత్రాత్మక నేపథ్యం కూడా దాగి ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒకప్పుడు ఎన్నో సంచలన రికార్డులకు, అద్భుతమైన సినిమా వేడుకలకు వేదికగా నిలిచిన చరిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం (సుదర్శన్ 70మి.మీ) థియేటర్ స్థానంలో ఈ సరికొత్త ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపుదిద్దుకుంటోంది. ఎంతోమంది అగ్ర హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులు ఎమోషనల్ బ్యాండింగ్ కలిగి ఉన్నారు. ఇప్పుడు అదే నేలపై సరికొత్త సినిమా సాంకేతిక విప్లవం రాబోతోంది. పాత జ్ఞాపకాలను అలాగే ఉంచుతూనే, సరికొత్త తరానికి సరిపడే అత్యాధునిక సాంకేతికతతో ఈ థియేటర్ నిర్మితమవుతోంది.
ప్రస్తుతం ఈ అద్భుతమైన మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఏఎంబీ క్లాసిక్ విక్టరీ అందుబాటులోకి రాన అద్భుతమైన సినిమా ప్రియులు ఇక్కడ ఐమాక్స్ అనుభూతిని చూసి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ మరియు మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్‌తో హైదరాబాద్‌లో సినిమా చూస్తే విధానమే మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ బిగ్ షాట్స్ మరియు ఏషియన్ గ్రూప్ కలిసి ఈ లగ్జరీ సినిమా ఎక్స్పీరియన్స్ సిటీ సినీ ప్రియులకు ఒక అద్భుతమైన కానుకగా నిలవనుంది.

