Home Latest News సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం: యువతను కాక్రోచ్ లతో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం! | సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం | తీవ్ర ఆగ్రహం | పోల్చడం | యువత – Andhra Waves

సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం: యువతను కాక్రోచ్ లతో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం! | సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం | తీవ్ర ఆగ్రహం | పోల్చడం | యువత – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో, సమాజంలో ప్రశ్నించే హక్కును వాడుకుంటున్న నిరుద్యోగ యువతను, ఆర్టీఐ యాక్టివిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒప్పందం తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ అంశంపై తెలుగువన్ వేదికగా జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ప్రత్యేకంగా దేశ యువత పారసైట్‌లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

గత కొన్నేళ్లుగా దేశంలో సాగుతున్న కమ్యూనల్, కుల పోలరైజేషన్ ప్రభావం దురదృష్టవశాత్తూ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదడుపై కూడా పడుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విమర్శకులను అర్బన్ నక్సలైట్లు అని ముద్రవేసిన పాలకులు.. ఇప్పుడు సరికొత్తగా బ్రాండింగ్ చేయడం ప్రారంభించారని, దానికి ఈ వ్యాఖ్యలను ఉదాహరణగా చూపించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పిస్తోంది. ఈ హక్కులను కాపాడాల్సిన న్యాయమూర్తి, ప్రశ్నించే వారిని అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.

దేశంలో నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం కాదు.. చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు, ఎంబీఏ చదివిన యువకులు డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా స్థిరపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ విద్యా విధానాలు, ఉపాధి కల్పన వైఫల్యమే అని డోలేంద్రప్రసాద్ అన్నారు.

న్యాయంగా ప్రభుత్వ న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రశ్నించాల్సింది సరైన మూర్తిగా ఉంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని.

మీడియా తన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించిందంటూ న్యాయమూర్తి వివరణ ఇవ్వడంపై ఆయన.. ఒక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తి తప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఆయన వెంటనే దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడితే ప్రతి మాట సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు యువతలో తీవ్ర తిరుగుబాటు ధోరణికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా పౌర సమాజం, న్యాయవ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ కంఠంనేని అన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird