Home Latest News నాదెండ్ల వెన్నుపోటు.. చంద్రబాబు ఎంట్రీ.. తీగల వెల్లడించిన సంచలన వాస్తవాలు | సంచలన నిజాలు బయటపెట్టిన తీగల కృష్ణారెడ్డి | నాదెండ్ల | ద్రోహం | cbn | ప్రవేశం | టీడీపీ | సభ్యత్వం | ఫ్రైవ్ | ntrbhawan | భూమి – Andhra Waves

నాదెండ్ల వెన్నుపోటు.. చంద్రబాబు ఎంట్రీ.. తీగల వెల్లడించిన సంచలన వాస్తవాలు | సంచలన నిజాలు బయటపెట్టిన తీగల కృష్ణారెడ్డి | నాదెండ్ల | ద్రోహం | cbn | ప్రవేశం | టీడీపీ | సభ్యత్వం | ఫ్రైవ్ | ntrbhawan | భూమి – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ స్థాపన, ఆనాటి రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వాస్తవాలు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ ప్రభంజనం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ గురించి మాట్లాడారు. టిడిపి తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆర్థికంగా పుంజుకున్న విధానాన్ని ఆయన వివరించారు.

1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథంపై దిల్ సుఖ్ నగర్ వచ్చినప్పుడు తన తండ్రితో కలిసి తాను ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మలక్‌పేట నియోజకవర్గంలో టిడిపి ఓడిపోతుందని తాను ముందే చెప్పానని.. కానీ రాష్ట్రవ్యాప్తంగా 200 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తాను చెప్పినట్టుగానే సరిగ్గా 202 ఎన్టీఆర్ ఘనవిజయం సాధించారని, ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ తనను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారని చెప్పారు.

మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని చెప్పారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ మొత్తం చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబుకు తన గురించి చెప్పి మలక్‌పేట ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారని తీగల వివరించారు.

పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం సృష్టించినప్పుడు పార్టీలో తీవ్ర అల్లకల్లోలం నెలకొందని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో తాను, మాజీ ఎమ్మెల్యే గోపాల్ సహా నలుగురు నేతలు ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమించామని చెప్పారు. ఆ సంక్షోభం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ నమ్మకమైన కార్యకర్తలను ఆదరించారని, అందులో భాగంగానే తనను హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్‌గా, కడియం శ్రీహరిని వరంగల్ ఉడా చైర్మన్‌గా నియమించారని.

టిడిపిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తానే కీలకనని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. మనం కేవలం ఎన్టీఆర్ ఇమేజ్‌పైనే గెలిచాం.. పార్టీ కలకాలం నిలబడాలంటే సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబుకు తాను చెప్పానని తీగల అన్నారు. కేవలం ఐదు రూపాయలు, వంద రూపాయల రుసుముతో కేవలం ఆరు రోజుల్లోనే 13 లక్షల రూపాయల నిధులు వచ్చాయని, ఆ తర్వాత అది కోట్ల రూపాయలకు చేరి ప్రధాన వనరుగా మారిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణం ఆనాడు హుడా చైర్మన్‌గా తానే భూమిని కేటాయించి, దానికి సంబంధించిన చెక్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద పంపించానని తీగల కృష్ణారెడ్డి చేశారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird