Home Latest News కెప్టెన్ రోహిత్ ఈజ్ బ్యాక్.. హిట్‌మ్యాన్‌కు మళ్లీ ముంబై ఇండియన్స్ పగ్గాలు.! | [ Rohit Sharma Mumbai Indians Captain | IPL 2027 Mumbai Indians | Hardik Pandya Punjab Kings Trade | Mumbai Indians Captaincy Change- Andhra Waves

కెప్టెన్ రోహిత్ ఈజ్ బ్యాక్.. హిట్‌మ్యాన్‌కు మళ్లీ ముంబై ఇండియన్స్ పగ్గాలు.! | [ Rohit Sharma Mumbai Indians Captain | IPL 2027 Mumbai Indians | Hardik Pandya Punjab Kings Trade | Mumbai Indians Captaincy Change- Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను తిరిగి జట్టు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకుంది. పాండ్యా బదులుగా ముంబై జట్టులోకి అర్ష్‌దీప్ సింగ్ వచ్చినట్లు సమాచారం. 

2013 నుంచి 2023 వరకు ముంబైని నడిపించిన రోహిత్, ఇప్పుడు రెండోసారి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. గత మూడు ఐపీఎల్ సీజన్లలో జట్టు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడం, కెప్టెన్సీ మార్పు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

పాండ్యా నిష్క్రమణ ఖరారు కాకముందే అక్టోబర్ మొదటి వారంలోనే రోహిత్‌కు పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. నాయకత్వ ఎంపికలో ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా ఉండాలని బుమ్రాను కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రోహిత్ పునరాగమనంపై ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్థిరత్వం, అనుభవం తిరిగి వస్తాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. పాత వైభవాన్ని జట్టు మళ్లీ అందుకుంటుందా లేదా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మీకు నచ్చవచ్చు: మహిళా కలెక్టర్‌కు వేధింపులు..TVK ఎమ్మెల్యే అరెస్ట్.!

మీకు నచ్చవచ్చు: RTC బస్సు డ్రైవర్‌కు మూర్ఛ.. స్టీరింగ్ పట్టి 73 మంది ప్రాణాలు కాపాడిన యువకుడు.!


[ Rohit Sharma Mumbai Indians Captain, IPL 2027 Mumbai Indians, Hardik Pandya Punjab Kings Trade, Mumbai Indians Captaincy Change, Rohit Sharma IPL Records ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird