Home Latest News ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య: కన్న కూతురినే కడతేర్చిన తండ్రి.! | పరువు హత్య | ఆదిలాబాద్ లో | హత్య కేసు | తండ్రి హత్య | కూతురు – Andhra Waves

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య: కన్న కూతురినే కడతేర్చిన తండ్రి.! | పరువు హత్య | ఆదిలాబాద్ లో | హత్య కేసు | తండ్రి హత్య | కూతురు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. పరువుపోతుందన్న భయంతో కన్నతండ్రే తన కుమార్తె ప్రాణాలు తీసిన విషాద ఘటన నార్నూర్ మండల పరిధిలోని ఉమ్రి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో కుటుంబం పరువు పోతుందన్న భయంతో తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కైలాస్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల పరువు పోతుందన్న కారణంతో తానే హత్య చేసినట్లు కైలాస్ విచారణలో అంగీకరించాడు.

ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కైలాస్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఘటనాస్థలంలో సాక్ష్యాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరిగింది.


[Honor killing,  in Adilabad,   murder case,   Father Murder, Daughter, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird