Home Latest News హెల్త్‌కేర్ టెక్నాలజీ దిగ్గజం నుంచి మహాదాత వరకు: వర్ధమాన్ జైన్ సేవా ప్రస్థానం.! | వర్ధమాన్ జైన్ | వ్యవస్థాపకుడు యాక్సెస్ హెల్త్‌కేర్ | బంగారు ఆభరణాలు | తిరుమలడోనార్ | శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ – Andhra Waves

హెల్త్‌కేర్ టెక్నాలజీ దిగ్గజం నుంచి మహాదాత వరకు: వర్ధమాన్ జైన్ సేవా ప్రస్థానం.! | వర్ధమాన్ జైన్ | వ్యవస్థాపకుడు యాక్సెస్ హెల్త్‌కేర్ | బంగారు ఆభరణాలు | తిరుమలడోనార్ | శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి వజ్ర వైడూర్యాలు, మరకత ​​మాణిక్యాలతో కూడిన దాదాపు 160 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించి వార్తల్లో నిలిచిన వర్ధమాన్ జైన్ నేపథ్యం ఏంటో తెలుసా? ఆయన వ్యాపార, వాణిజ్య వివరాలు, విద్యార్హతల గురించి తెలుసుకోవాలని ఉందా. అయితే చదవండి. ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ సంస్థ యాక్సెస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, వైస్ ఛైర్మన్‌ ఈ వర్ధమాన్ జైన్. వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ఆధ్యాత్మిక, సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఏకకాలంలో మానవ సేవా, మాధవ సేవా చేస్తారు. అందులో భాగంగానే స్వామివారికి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే వివిధ రకాల స్వర్ణాభరణాలను ఆయన భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

వర్ధ జైన్ క లయోల కళాశాలలో స్టాటిస్టిక్స్ డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. గణాంక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ రంగాల్లో పొందిన ఈ బలమైన పునాది ఆయన భవిష్యత్ సాంకేతికత, వ్యాపార ప్రస్థానానికి కీలకంగా మారింది.

వృత్తిపరంగా హెల్త్‌కేర్ టెక్నాలజీ, బీపీఓ రంగాల్లో వర్ధమాన్ జైన్‌కు విశేషమైన అనుభవం ఉంది. గతంలో ఆయన అంతర్జాతీయ ఐటీ సంస్థ డెల్ సర్వీసెస్‌లో బీపీఓ ఆవిడ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి సంస్థ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విజన్ హెల్త్‌సోర్స్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరించడంతో పాటు, ఆసియా ఇంజనీరింగ్ సంస్థకు సహ యజమానిగా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

సాంకేతిక ఆవిష్కరణల రంగంలోనూ వర్ధమాన్ జైన్ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) టెక్నాలజీ అభివృద్ధి, వినియోగంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇమేజ్ ప్రాసెసింగ్, మెడికల్ కోడింగ్ రంగాల్లో ఆయన పేరుతో పేటెంట్లు ఉండటం వల్ల ఆయన సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. యాక్సెస్ హెల్త్‌కేర్ ద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఆధునిక ఆటోమేషన్ విధానాలను ప్రవేశపెట్టి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఇది కూడా చదవండి: తిరుమలేశునికి రూ.160 కోట్ల బంగారు ఆభరణాలు: చంద్రబాబు సమక్షంలో సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు.!

వర్థమాన్ జైన్ కు దైవ భక్తి మెండు. అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుని పట్ల ఆపారమైన భక్తి. దైవభక్తితో పాటు సామాజిక సేవ విషయంలో కూడా ఆయన తన బాధ్యతను విస్మరించలేదు. చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు, పేద పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. అలాగే పేద యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి వారికి మార్గాలు చూపేందుకు ఆస్కార్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన వంటి అనేక సేవా కార్యక్రమాలను వర్ధమాన్ జైన్ చేస్తారు. వ్యాపార రంగంలో సాధించిన విజయాలను సమాజహితం, ఆలయ సేవలకు వినియోగించాలన్న సంకల్పంతో ఆయన గతంలోనూ టీటీడీకి విరాళాలు అందించడంతో తాజాగా రూ. 160 కోట్ల విలువైన వజ్ర, వైడూర్య, మరకత ​​మాణిక్య ఖచిత స్వర్ణాభరణాలను సమర్పించారు.

తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి ఆయన అందించిన ఈ అమూల్యమైన ఆభరణాలు ఆలయ నిబంధనల ప్రకారం తనిఖీలు, నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారి, అమ్మవారి అలంకరణలో భాగం కానున్నాయి.

మీకు నచ్చవచ్చు: వర్థమాన్ జైన్ ఎవరో తెలుసా: తిరుమలేశునికి 121 కిలోల బంగారం విరాళం ప్రకటించిన దాత.!

శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం: ఓ భక్తుడి వితరణ: ఎప్పుడంటే.?

[VardhmanJain, founder Access Healthcare, gold ornaments, TirumalaDonar, Sri Sarita Jain Foundation, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird