Home Latest News అన్నీ మనమే గెలవాలనే తత్వం.. ఏపీ రాజకీయాలను ఎటువైపు నడిపిస్తోంది.? | AP స్థానిక సంస్థల ఎన్నికలు 2026 | వాస్తవ వేదిక | కంటమనేని రవిశంకర్ | డోలేంద్ర ప్రసాద్ | స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ | రాజకీయ విశ్లేషణ | సీఎం చంద్రబాబు | వైఎస్ జగన్ – Andhra Waves

అన్నీ మనమే గెలవాలనే తత్వం.. ఏపీ రాజకీయాలను ఎటువైపు నడిపిస్తోంది.? | AP స్థానిక సంస్థల ఎన్నికలు 2026 | వాస్తవ వేదిక | కంటమనేని రవిశంకర్ | డోలేంద్ర ప్రసాద్ | స్థానిక సంస్థల ఎన్నికలు | ఆంధ్రప్రదేశ్ | రాజకీయ విశ్లేషణ | సీఎం చంద్రబాబు | వైఎస్ జగన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రతి రాజకీయ పరిణామం రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసేలా మారుతున్న తరుణంలో, స్థానిక ఎన్నికలు కేవలం గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి పరిమితం కాకుండా అత్యంత కీలకమైన రాజకీయ రణక్షేత్రంగా మారుతున్నాయి. ఒకప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి, స్థానిక నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఎన్నికలు, నేడు సంపూర్ణ పార్టీ రాజకీయాల జోక్యంతో తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి వాస్తవ వేదిక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై లోతైన విశ్లేషణ చేశారు.

రాజకీయ పరిస్థితి – స్థానిక ఎన్నికల్లో పార్టీ జోక్యం.!

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సాధారణంగా డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సరఫరా, పన్నుల వసూలు వంటి స్థానిక సమస్యల పరిష్కారానికి పరిమితం కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక పదవులు అన్నీ అధికార పార్టీల చేతిలోనే ఉండాలనే ధోరణి నేడు బలంగా వేళ్లూనుకుంది. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ‘అన్నీ మనమే గెలవాలి’ అనే ఏకపక్ష విధానం, నేడు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో కొనసాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది లేకపోవడాన్ని, దాని ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం అధికార పక్షం చేయడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాలోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్థానిక ప్రతినిధులు పరిపాలన సాఫీగానే సాగిందని, ప్రతిపక్షంపై ఎందుకు అంత భయం అనే ప్రశ్న ఉదయిస్తోంది.

వ్యూహాలు రాజకీయ అంతర్గత సమీకరణలు.!

ప్రస్తుత వ్యూహాలు కేవలం ప్రజా సంక్షేమం చుట్టూ తిరగడం లేదు. రాజకీయం పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది. గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అధికారం కోసం, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచే సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సైతం గ్రామాభివృద్ధి గురించి ఆలోచించడం కంటే, ఏ కాంట్రాక్టులు వస్తాయి, ఏ నిధులు పిండుకోవచ్చు అనే కోణంలోనే ఆలోచిస్తున్న దుస్థితి. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన సమయంలో తగిన నాయకత్వాన్ని, ఆర్థిక మద్దతును అందించలేకపోతున్నాయి. నాయకులు తమ స్వార్థం, ఎమ్మెల్యే టికెట్లు, వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూనే రాజకీయం నడిపిస్తున్నారు తప్ప, కార్యకర్తలకు నిలవడంలో విఫలమవుతున్నారు. ఈ స్వార్థపూరిత ధోరణి ప్రజాస్వామ్య మూలాలనే దెబ్బతీస్తోంది.

భవిష్యత్ రాజకీయ ప్రభావం.!

ఈ అపరిపక్వ రాజకీయ ధోరణులు సర్వస్వం తామే గెలవాలనే అహంకారపూరిత వైఖరి భవిష్యత్తులో తీవ్ర “దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ఉంది లేనిచో, అధికారం అనేది ప్రజాసేవ నుంచి పూర్తిగా వైదొలిగి కేవలం సంపాదన మార్గంగా మారిపోతుంది.

[ AP Local Body Elections 2026, Vasthava Vedika, Kantamaneni Ravi Shankar, Dolendra Prasad, 

Local Body Elections, Andhra Pradesh, Political Analysis, CM Chandrababu, YS Jagan, Pawan kalyan ]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird