Table of Contents
తమిళ రాజకీయాల్లో విషాదం జరిగింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కొలత్తూరు నియోజకవర్గంలో ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వీఎస్ బాబు సెప్టెంబర్ 9వ తేదీన చెన్నై అమింజిక్కరైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు.
అప్పటి నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2:14 గంటలకు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. 2:24 గంటలకు మరణించారు. ఈ విషయాలను ఆసుపత్రి అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆయన మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రస్థానం ఇది..
వీఎస్ బాబు తన రాజకీయ జీవితాన్ని డీఎంకేలో ఏరియా సెక్రటరీగా కలిగి ఉన్నారు. ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2006 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పురసవాకం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన కొలత్తూరులో 2011 ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ విజయంలో కీలకంగా వ్యవహరించారు.
