Home సినిమా ఈఎన్ఈ 2 మూవీ రివ్యూ – Andhra Waves

ఈఎన్ఈ 2 మూవీ రివ్యూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈఎన్ఈ 2 మూవీ రివ్యూ


ఎలా నవ్వించాము అన్నది కాదు, నవ్వించామా లేదా అన్నది ఓ కాన్సెప్ట్, సినిమా జనాలకు. జస్ట్ ఓ థ్రెడ్..దానికి సరిపడా సన్నివేశాలు ప్లస్ సంభాషణలు, సరైన కామెడీ పండించగల ఆర్టిస్ట్ లు వుంటే చాలు, ఆదరించడానికి జనం రెడీగా వుంటారు. పైగా కామెడీ సినిమాలకు పెద్దగా లాజిక్ లు అక్కరలేదు. కానీ ఇక్కడ సమస్య ఉన్న కథ, లాజిక్కులు లేకున్నా జనం క్షమిస్తారు కానీ, నడగ ఆగకుండా సాగాలి. నవ్వులు ఆపకుండా వినపడాలి. అక్కడ వస్తుంది సమస్య. బాగా నవ్వేసిన తరువాత బాగా గ్యాప్ వచ్చినా ఇబ్బందిగా ఫీలవుతారు ప్రేక్షకులు. పెద్దగా కథ లేని కామెడీ సినిమా తీయడం అంత సులువు కాదు.

ఈవారం వచ్చిన ఈ నగరానికి ఏమైంది రీపీట్ లేదా సీక్వెల్ అవుట్ అండ్ అవుట్ అవుట్ ఇలాంటి సినిమానే. కథకి దూరంగా కామెడీకి దగ్గరగా వుండే ప్రయత్నం. ఈనగరానికి ఏమైంది సినిమాలో నటించిన టీమ్ అంతా ఈ సినిమాలోనూ ఉన్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్. సినిమా అంటే పిచ్చి వున్న నలుగురు కలిసి, ఓ సినిమా ఎలా తీసి చూపించారు అన్నది కథ.

కొత్త కథ కాదు, భారీ మేకింగ్ లేదు. జస్ట్ తొలిసగంలో కొన్ని, మలిసగంలో కొన్ని నవ్వులు మాత్రమే. ముఖ్యంగా కౌశిక్ (అభినవ్ గోమఠం) ను రాసుకున్న తీరు, పాత్రను ప్రదర్శించిన వైనం. ఇవే సినిమాను నిలబెట్టాయి.

సినిమా తొలిసగం చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఏమంత ఆసక్తికరంగా వుండదు. ఓ పావుగంట సినిమా గడచిన తరువాత మెల్లగా కనెక్ట్ కావడం ప్రారంభం అవుతుంది. అప్పటి కానీ సినిమా ఓ దోవలో పడదు. ఆ తరువాత నుంచి కుర్రకారుడు కామెడీ డైలాగులతో విశ్రాంతి వరకు బండి బాగానే లాగించేస్తారు. విశ్రాంతి తరువాత చాలా సినిమాల మాదిరిగానే నెమ్మదించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లు వగైరా సీన్లు బోర్ కొట్టాయి. ఒకసారి అక్కడ షూటింగ్ ప్రారంభమైన తరువాత జరిగే ఫన్ సంఘటనలు బాగా నవ్విస్తాయి. అభినవ్ గోమటం తనదైన శైలి నటన, డైలాగ్ డెలవరీ తో ఆకట్టుకుంటే వాటికి సరిపడా ఫన్ డైలాగులు రాసి తరుణ్ భాస్కర్ దాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఈ షూటింగ్ అన్నీ షార్ట్ ఫిలిం ఆటలా ఉంటాయి. ఆ సిల్లీ సీన్స్ లో కామెడీ పుడితే నవ్వి ఎంజాయ్ చేయడమే. ఎక్కువ పాత్రలు వున్నా, ఫోకస్ రెండు మూడు సినిమాల్లో పాత్రల మీదే పడింది. ప్రధానమైన విశ్వక్ సేన్ పాత్ర కూడా ఏమంత గొప్పగా డిజైన్ చేయలేదు. హీరోయిన్ తండ్రి పాత్రను ఓ లెవెల్ లో చూపించి, తొలిసగం తరువాత డమ్మీ చేసేసారు. సినిమా చివర్లో సినిమా రంగం గురించి, దాని గొప్పతనం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు అందరికీ కనెక్ట్ అయ్యేవి కాదు.

మొత్తంగా చూసుకుంటే రెండున్నర గంటల్లో ఒక గంటన్నర కాలక్షేపానికి అయితే లోటు లేదు. అంతకు మించి కోరుకుంటే సినిమా నచ్చదు. ఈ పాత్ర హడావుడి ఏమిటి? ఆ పాత్ర మరీ అలా ఎందుకు వుంది అలా అన్నవి ఆలోచించకూడదు. డైలాగుల్లో అలవాటైపోతున్న బూటుపదాలను విని బాధపడకూడదు. అవన్నీ ఆలోచిస్తే సినిమా నచ్చదు. కాలక్షేపం బటానీ అన్న పాయింట్ బుర్రలో పెట్టుకుంటే చల్తా.

సినిమాకు ప్లస్ అయిన విషయాల్లో వివేక్ సాగర్ నేపథ్య సంగీతం ఒకటి. కామెడీ సినిమా అనేట్లు కాకుండా కొత్తగా వుంది. సినిమాటోగ్రఫీ ఏమంత చెప్పుకునేంత లేదు. అలాగే నిర్మాణ విలువలు కూడా. కేవలం కామెడీ సీన్లు, అభినవ్ గోమటం కామెడీ టైమింగ్, తరుణ్ భాస్కర్ స్టయిల్ డైలాగులు సినిమాను కాస్త గట్టెక్కించాయి.

ప్లస్ పాయింట్లు

ఫన్ సీన్లు

అభినవ్

ప్రీ క్లయిమాక్స్

మైనస్ పాయింట్లు

ఆరంభంలో పావుగంట

మలిసగంలో కొంత

పంచ్ లైన్

ఈ నగరానికి ఏం కాలేదు

రేటింగ్ 2.5/5

The post ఈఎన్ఈ 2 మూవీ రివ్యూ appeared first on iDreamPost.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird