Home సినిమా ఈ డార్క్ థ్రిల్లర్ చూశారా! – iDreamPost – Andhra Waves

ఈ డార్క్ థ్రిల్లర్ చూశారా! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఈ డార్క్ థ్రిల్లర్ చూశారా! - iDreamPost


ఒకప్పుడు కాలేజ్ లైఫ్, ప్రేమలు, స్నేహాలు, పోటీలు అంటే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు అదే ఫ్రాంచైజీ పూర్తిగా కొత్త అవతారంలోకి మారిపోయింది. కాలేజ్‌లో హత్య.. దాని వెనుక దాగిన రహస్యాలు.. ప్రాణాలకు తెగించి ఆడాల్సిన సీక్రెట్ గేమ్.. ఇలా క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రూపొందించిన వెబ్‌సిరీస్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే ..సెయింట్ థెరిసా కాలేజీలో అందరికీ ఇష్టమైన అమ్మాయి ఆయేషా అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సరస్సులో శవమై కనిపిస్తుంది. అయితే ఆమె మరణం వెనుక ఏదో రహస్యం ఉందని ఆమె కవల సోదరి అదితి అనుమానిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అదే కాలేజీలో చేరుతుంది.

అక్కడికి వెళ్లిన తర్వాత అదితికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. కాలేజీలో కొందరు రహస్య వ్యక్తులు ఓ సీక్రెట్ కాంపిటీషన్ గురించి తెలుస్తుంది. ఆ పోటీలో గెలుపోటములు కేవలం బహుమతులకే పరిమితం కావు.. ప్రాణాలకే ప్రమాదంగా మారతాయి. మరి ఆయేషాను చంపింది ఎవరు? ఆమె మరణానికి కాలేజీలోని విద్యార్థులకు ఏమైనా సంబంధం ఉందా? ఈ రహస్య పోటీ వెనుక ఉన్నది ఎవరు? అనేది కథలో ఆసక్తికరమైన అంశం.ఈ వెబ్‌సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird